అంతరిక్షంలో రెండు రకాల పంటలను పండించారు నాసా వ్యోమగామి మైఖెల్ హాప్కిన్స్. పాక్ చోయి అనే పంటను ఇదివరకే పండించగా.. అమారా ఆవాల మొక్కలనూ ఆయన పండించారని నాసా వెల్లడించింది. 64 రోజుల పాటు ఇవి పెరిగాయని తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యంత ఎక్కువ కాలం పెరిగిన ఆకు కూరల పంట ఇదేనని పేర్కొంది.
పాక్ చోయి అనే మొక్కలు.. పుష్పాలు పూసేంత పెద్దగా ఎదిగాయని నాసా తెలిపింది. పుష్పాలను పాలినేట్ చేసేందుకు చిన్నపాటి పెయింట్ బ్రష్‌ను హాప్కిన్స్ వినియోగించినట్లు వెల్లడించింది.
"పాక్ చోయిని హాప్కిన్స్ సైడ్ డిష్‌గా తిన్నారు. వాటి ఆకులను ఖాళీ టోర్టిలా ప్యాజేజీలలో నానబెట్టారు. సోయా సాస్, వెల్లుల్లిని వాటితో కలిపి ఆహారం వేడి చేసే యంత్రంలో 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచారు."
-నాసా
అంతరిక్షంలో పండించిన ఈ ఆకుకూరను రుచి చూసిన తర్వాత.. 'డెలీషియస్, క్రంచీ'గా ఉందంటూ ఎక్స్పెరిమెంట్ నోట్లో రాశారు హాప్కిన్స్. అమారాను ఇక్కడి వ్యోమగాములు పాలకూరలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారని చెప్పారు. చికెన్, సోయా సాస్, వెనిగర్ వంటి ఇంగ్రీడియెంట్లను అందులో కలుపుకుంటున్నారని తెలిపారు.
త్వరలో మిరియాలు, టమాటాలు!
పండ్ల మొక్కలను పండించేందుకు పాలినేషన్ అవసరం అవుతుంది కాబట్టి ఈ ప్రయోగాలపై శ్రద్ధ పెట్టింది నాసా. మరోవైపు, ప్లాంట్ హాబిటాట్-04 ప్రయోగంలో భాగంగా వచ్చే ఏడాది మిరియాల విత్తనాలను అంతరిక్షానికి పంపించనున్నట్లు నాసా వెల్లడించింది. స్పేస్ఎక్స్ వాణిజ్య మిషన్ ద్వారా వీటిని కెన్నెడీ స్పేస్ సెంటర్ పంపించనుందని చెప్పింది. వెజ్-05 అనే ప్రయోగంతో మరుగుజ్జు టమాటాలను పండించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఈ ప్రయోగాలు చేయనున్నట్లు వివరించింది.
ఇదీ చదవండి-చందమామ వ్యోమగామి మైఖేల్ కన్నుమూత