తెలంగాణ

telangana

ETV Bharat / international

పరువు నష్టం కేసులో ఎలాన్​ మస్క్​కు చుక్కెదురు

టెస్లా సంస్థ అధినేత ఎలాన్​ మస్క్​ ఓ పరువు నష్టం కేసులో ఇరుక్కున్నారు. దీనిపై తాజాగా అమెరికాలోని ఓ కోర్టు విచారణ జరిపింది. అయితే ఇందులో మస్క్​ వాదనలను న్యాయమూర్తి తిరస్కరించారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

Tesla Critics Defamation
పరువు నష్టం కేసులో ఎలాన్​ మస్క్​కు చుక్కెదురు

By

Published : Jan 30, 2021, 8:02 AM IST

ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​కు కోర్టులో చుక్కెదురైంది. మస్క్​ తనకు పరువు నష్టం కలిగించాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన దావాపై న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే.. ఫిర్యాదు దారుడు దాఖలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందనే మస్క్​ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

అసలేం జరిగింది?

మిషిగాన్​ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్​ విద్యార్థి రణ్​దీప్​ హోతి. 2019 ఫిబ్రవరిలో కాలిఫోర్నియా, ఫ్రీమోంట్​లోని టెస్లా విక్రయ కేంద్రంలోకి కార్లపై అధ్యయనం చేసేందుకు వెళ్లగా.. భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అదే ఏడాది ఏప్రిల్​లో అతను కారులో వెళ్తుండగా.. టెస్లా టెస్టు కారు ఫొటోలను తీశాడు. ఆ తర్వాత వాటిని ఆన్​లైన్​లో పోస్ట్​ చేశాడు. ఈ రెండు సంఘటనలు.. మస్క్​ ఆగ్రహానికి కారణమయ్యాయి.

అనంతరం.. హోతిపై ఆన్​లైన్​ టెక్​ ఎడిటర్​కు మస్క్ ఫిర్యాదు చేశారు. హోతి తన కారులో దూసుకొచ్చి, తమ ఉద్యోగులపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. అతడు అబద్ధాలకోరని చెప్పాడు.

పరువునష్టం దావా..

అయితే.. మస్క్​ తనపై ఆన్​లైన్​లో విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాడని అలమెడా కౌంటీ సుపీరియర్​ కోర్టులో హోతి.. అదే ఏడాది ఆగస్టులో పరువునష్టం దావా దాఖలు చేశాడు. దీనిపై తాజాగా న్యాయస్థానం విచారణ జరిపింది.

తాను ప్రజా ప్రయోజనం దృష్ట్యానే హోతిపై ఆ వ్యాఖ్యలు చేశానని అందుకే ఆ దావాను కొట్టివేయాల్సిందిగా న్యాయమూర్తిని మస్క్​ అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్​ జులియా స్పెయిన్​.. మస్క్​ వాదనల్లో నిజాన్ని తేల్చాల్సి ఉందని లిఖిత పూర్వక తీర్పులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కుక్కకు మస్క్​ గిఫ్ట్​- ఆ కంపెనీ షేర్లు హిట్​

ABOUT THE AUTHOR

...view details