హైస్కూల్లో కాల్పుల కలకలం.. పలువురికి గాయాలు! - టెక్సాస్‌లో కాల్పులు
22:05 October 06
హైస్కూల్లో కాల్పుల కలకలం.. పలువురికి గాయాలు!
అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. టెక్సాస్ అర్లింగ్టన్లోని ఓ హైస్కూల్లో జరిగిన కాల్పుల్లో నలుగురు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
కాల్పులు జరిగిన సమయంలో పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి టిమోతీ జార్జ్ సింప్‌కిన్స్‌గా అధికారులు గుర్తించారు. స్కూల్ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.