తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆన్​లైన్​ వీడియోలు చూసే పిల్లల సంఖ్య రెట్టింపు

ఈ కాలం యువత టీవీ కంటే ఆన్​లైన్​ వీడియోలే ఎక్కువగా చూస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. కామన్​ సెన్స్​ మీడియా అనే సంస్థ అమెరికాలో 8 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న 17వందల మంది అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించింది.

By

Published : Oct 30, 2019, 3:25 PM IST

Updated : Oct 30, 2019, 6:47 PM IST

ఆన్​లైన్​ వీడియోలు చూసే పిల్లల సంఖ్య రెట్టింపు

ఆన్​లైన్​ వీడియోలు చూసే పిల్లల సంఖ్య రెట్టింపు

సాంకేతికతతోపాటు జీవన విధానాలూ మారిపోతున్నాయి. పిల్లల జీవితంలో కీలకమైన ఆటల స్థానాన్ని... ఇప్పుడు ఆన్​లైన్​ గేమ్స్​ ఆక్రమించాయి. టీవీకి బదులు... ఆన్​లైన్​ వీడియోల హవా నడుస్తోంది. ఎక్కువ శాతం టీనేజర్లు టీవీని చూడటం కంటే ఆన్​లైన్​ వీడియోలవైపే మొగ్గు చూపుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.

కామన్​ సెన్స్ మీడియా అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఇందుకోసం అమెరికాలో 8 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న17వందల మంది జీవనశైలిని విశ్లేషించింది.

నాలుగేళ్ల క్రితంతో పోల్చితే ప్రతిరోజు ఆన్​లైన్​ వీడియోలను చూసే అమెరికన్​ యువత సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. వారు గతంలో సగటున రోజుకు అరగంట మాత్రమే ఆన్​లైన్​ వీడియోలు చూడగా... ఇప్పుడు ఆ సమయం గంటకు చేరింది.

ఇదీ చూడండి:ఉగ్రవాదంపై కలిసి పోరాడాలి: ఈయూ బృందంతో మోదీ

Last Updated : Oct 30, 2019, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details