Miss USA 2019 Winner: మిస్ యూఎస్ఏ 2019 చెస్లీ క్రిస్ట్(30) అనుమానాస్పద రీతిలో మరణించారు. 60 అంతస్తుల భవనం నుంచి కిందపడి ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తన హృదయం ముక్కలైందని మిస్ యూనివర్స్-2021 హర్నాజ్ సంధు అన్నారు. చెస్లీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.
చెస్లీ క్రిస్ట్ తొమ్మిదో అంతస్తులో నివసిస్తారని అధికారులు తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.