తెలంగాణ

telangana

ETV Bharat / international

అందాల ప్రదర్శనతో ట్రాన్స్​జెండర్ల హొయలు

ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో అందాల పోటీలు జరిగాయి.  ఎవరికో తెలుసా?... ట్రాన్స్​జెండర్లకు.​ మిస్​ ట్రాన్స్​ బ్యూటీ మెక్సికో-2019 పేరిట నిర్వహించిన పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 21 మంది ట్రాన్స్​జెండర్లు పాల్గొన్నారు. అందాల నడకలతో, ఆకర్షణీయమైన దుస్తులతో అందరినీ అలరించారు. న్యాయనిర్ణేతల్ని మెప్పించి అందాల సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది ఇవన్నా.

By

Published : Jul 29, 2019, 9:53 PM IST

మిస్​ ట్రాన్స్​ బ్యూటీ మెక్సికో-2019

మిస్​ ట్రాన్స్​ బ్యూటీ మెక్సికో-2019

మెక్సికోలో ట్రాన్స్​జెండర్ల అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. మిస్​ ట్రాన్స్​ బ్యూటీ ఆఫ్​ మెక్సికో-2019 పేరిట నిర్వహించిన ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి 21 మంది ట్రాన్స్​ మహిళలు పాల్గొన్నారు.

వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి.. న్యాయనిర్ణేతల్ని మెప్పించారు. అందాల మెరుపులతో.. క్యాట్​వాక్​​తో సందడి చేసి మైమరిపించారు.
బికినీలు.. ప్రాంతీయ సంప్రదాయ, ప్రత్యేక దుస్తులు ధరించి వేదికపై హొయలొలికించారు. అన్ని రంగాల్లో వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి... నిర్ణేతల మనసు గెల్చిన ఇవన్నా కెజారెస్(27)​ మిస్​ ట్రాన్స్​ బ్యూటీ మెక్సికో-2019 కిరీటాన్ని గెల్చుకుంది.

కమ్యూనికేషన్స్​లో డిగ్రీ చేస్తున్న.. కెజారెస్​ సొంతంగా బ్యూటీ సెలూన్​ కూడా నిర్వహిస్తోంది. టైటిల్ గెలవడం వల్ల తన లాంటి వారి తరఫున గొంతెత్తి మాట్లాడే అవకాశం కలిగిందని చెబుతోంది ఇవన్నా. ​

''మొదట మనమిక్కడ ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. అదే మనకు ఇతరుల మెప్పు పొందేందుకూ అవకాశం కల్పిస్తుంది. మనమే అలా నడుచుకోకుంటే.. ఇతరుల నుంచి గౌరవమర్యాదలను డిమాండ్​ చేయలేం.''
- ఇవన్నా కెజారెస్​, మిస్​ ట్రాన్స్​ బ్యూటీ మెక్సికో-2019

సాధారణంగా కనిపించే వీరి జీవితాల వెనక కొన్ని కన్నీటి గాథలు ఉన్నాయి. మెక్సికో నగరంలో ట్రాన్స్​ మహిళలకు కనీస భద్రత లేదు. స్థానిక ఎల్​జీబీటీ హక్కుల సంఘం 'లెట్రా ఎస్​'​ సమాచారం ప్రకారం 2013- 18 మధ్య ఈ వర్గానికి చెందిన 261 మంది మహిళలు హత్యకు గురయ్యారు. స్థానికంగా వారిపై భిన్నాభిప్రాయాలు ఉండటమే అందుకు కారణం.

సమాజంలో ట్రాన్స్​జెండర్​ కమ్యూనిటీ​కి ప్రత్యేక గుర్తింపు కోసమే ఈ అందాల పోటీల్ని నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకుడు ఫ్లిపీ మొరల్స్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details