అమెరికాలో నవంబర్ 3న జరిగిన ఎన్నికల ఫలితాలను వచ్చే వారం ధ్రువీకరించాలని రాష్ట్ర పరిశీలకులకు మిషిగన్ ఎన్నికల ఏజెన్సీ సిఫార్సు చేసింది. ఇప్పటికే వెల్లడైన ఫలితాలను ఖరారు చేయాలని తెలిపింది. ఈ నిర్ణయం అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు లాభించనుంది.
'మిషిగన్‌లో బైడెన్ గెలుపునే ఖరారు చేసేయండి'
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు అనుకూలంగా మిషిగన్ ఎన్నికల ఏజెన్సీ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే వారంలో ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించాలని రాష్ట్రంలో ఎన్నికల పరిశీలకులకు సిఫార్సు చేసింది. ఇప్పటికే వెల్లడైన ఫలితాలనే ఖరారు చేయాలని స్పష్టం చేసింది.
బైడెన్
మిషిగన్ రాష్ట్ర చట్ట సభ్యులను శ్వేతసౌధానికి పిలిచి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో తాజా సూచనలు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 83 కౌంటీల్లో ధ్రువీకరించిన ఫలితాలను పంపినట్లు వెల్లడించింది.