తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మైఖేల్​ బ్లూమ్​బర్గ్​ - అమెరికా అధ్యక్ష ఎన్నికలు

ఊహాగానాలకు తెరదించుతూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై స్పష్టతనిచ్చారు ప్రముఖ వ్యాపారవేత్త మైఖేల్ బ్లూమ్​బర్గ్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్​ను మరో నాలుగేళ్లు భరించే శక్తి లేదని వ్యాఖ్యానించారు బ్లూమ్​బర్గ్.

మైఖేల్​ బ్లూమ్​బర్గ్​

By

Published : Nov 25, 2019, 11:34 AM IST

Updated : Nov 25, 2019, 3:56 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మైఖేల్​ బ్లూమ్​బర్గ్​

ప్రముఖ వ్యాపారవేత్త మైఖేల్​ బ్లూమ్​బర్గ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారత్​-అమెరికా సంబంధాలకు మద్దతుదారుగా ఉన్న ఆయన డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు.

"ట్రంప్​ను ఓడించేందుకు నేను అధ్యక్ష ఎన్నికల్లో నిలబడుతున్నా. అమెరికా పునర్నిర్మాణమే నా లక్ష్యం. ట్రంప్​ పాలనను మరో నాలుగేళ్లు భరించే అవసరం అమెరికన్లకు లేదు. అమెరికాకు, మన విలువలకు ట్రంప్​ అత్యంత ప్రమాదకారిగా ఉన్నారు. ఆయన మరోసారి గెలిస్తే ఆ నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేం. ఈ ఎన్నికల్లో మనం తప్పకుండా గెలవాలి. "

- మైఖేల్ బ్లూమ్​బర్గ్, ప్రముఖ వ్యాపారవేత్త

డెమొక్రాట్లకు ఫిబ్రవరి 3న అయోవా వేదికగా జరిగే ప్రాథమిక పోరులో బ్లూమ్​బర్గ్​ పాల్గొనే అవకాశం ఉంది.

ఢీ అంటే ఢీ...

ట్రంప్​, బ్లూమ్​బర్గ్ ఇద్దరూ దిగ్గజ వ్యాపారవేత్తలు. బ్లూమ్​బర్గ్ గతంలో​ న్యూయార్క్​ మేయర్​గా పనిచేశారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం 10 బిలియన్​ డాలర్ల వరకు విరాళాలు అందించారు. ఆయనకు చెందిన స్వచ్ఛంద సంస్థలు 129 దేశాల్లోని 510 నగరాల్లో సేవలందిస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడైన బ్లూమ్​బర్గ్​.. వాతావరణ మార్పులపై పోరాటంలో క్రియాశీలకంగా పనిచేశారు. గత ఐదేళ్లలో భారత్​కు అనేకసార్లు వచ్చారు.

ఇదీ చూడండి: అధ్యక్షుడికి అగ్నిపరీక్ష... అభిశంసన ఫలితం ఎలా?

Last Updated : Nov 25, 2019, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details