తెలంగాణ

telangana

ETV Bharat / international

'కాపాడు తల్లీ'... అగ్నిపర్వతానికి ప్రత్యేక పూజలు

"నిద్రించే మహిళ"... ఇజ్టెక్సిహుత్​ అగ్నిపర్వతానికి మెక్సికోవాసులు పెట్టిన పేరు. పేరు మాత్రమే పెట్టలేదు... దైవంగా భావిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నైవేద్యం సమర్పిస్తున్నారు. ఎందుకలా?

'కాపాడు తల్లీ'... అగ్నిపర్వతానికి ప్రత్యేక పూజలు

By

Published : May 6, 2019, 11:00 AM IST

'కాపాడు తల్లీ'... అగ్నిపర్వతానికి ప్రత్యేక పూజలు
మెక్సికో శాంటియాగో ప్రాంతంలోని ఇజ్టెక్సిహుత్​ అగ్నిపర్వతానికి ప్రత్యేక పూజలు చేశారు షాలిట్​జింట్లా వాసులు. ప్రజలను రక్షించాలని, సమృద్ధిగా వర్షాలు కురిపించి, పంటలు పండించాలని వేడుకున్నారు. వందల మంది గ్రామవాసులు పర్వతానికి చేరుకుని తమకు తోచిన విధంగా పూలు, పళ్లు, పలహారాలు సమర్పించారు. ఇజ్టెక్సిహుత్​ సమీపంలోని ఇతర అగ్నిపర్వతాలు శాంతంగా ఉండేలా చూడాలని ప్రార్థించారు.

ప్రస్తుతం పోపోకాటేపెట్ల్​ అనే అగ్నిపర్వతం నిప్పులు చెరుగుతోంది. పరిసర ప్రాంత ప్రజలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చేసేది లేక ఇజ్టెక్సిహుత్​ అగ్నిపర్వతాన్ని వేడుకునేందుకు కొండపైకి వందల మంది ప్రజలు చేరుకున్నారు.

" మాకు అన్నీ ఇచ్చినందుకు ఇజ్టెక్సిహుత్​ పర్వత మాతకు మేము కృతజ్ఞతలు చెబుతున్నాం. మా పంటల కోసం వర్షాలు కురిపించాలని ఆమెను అడుగుతున్నాం. ఇక్కడ జీవించేందుకు వీలు కల్పించినందుకు, సంతోషంగా ఉండేందుకు చోటు ఇచ్చినందుకు అగ్నిపర్వతాలకు మేము కృతజ్ఞులం. "
- నసారియో, శాంటియాగో షాలిట్​జింట్లా వాసి.

ఈ వేడుకలు ఏటా మే ప్రారంభంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. తమ వెంట తీసుకొచ్చిన పుష్పాలు, వివిధ రకాల వంటకాలను సమర్పించిన అనంతరం ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతారు.

ఇదీ చూడండి:ఒడిశాలో 'ఫొని' మృతుల సంఖ్య 34కి చేరిక

ABOUT THE AUTHOR

...view details