తెలంగాణ

telangana

ETV Bharat / international

ఘోర రోడ్డు ప్రమాదం- 53 మంది దుర్మరణం - మైగ్రెంట్స్​ యాక్సిడెంట్

Mexico road accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 53 మంది మరణించారు. 54 మంది గాయపడ్డారు.

Mexico road accident
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Dec 10, 2021, 7:26 AM IST

Updated : Dec 10, 2021, 9:58 AM IST

Mexico road accident: మెక్సికోలోని చియాపాస్​ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వలసదారులతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తాపడి పాదచారుల వంతెనను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 53 మంది వలసదారులు మరణించారు. 54 మంది గాయపడ్డారు.

Chiapas accident: క్షతగాత్రుల్లో 21 మంది తీవ్రంగా గాయపడ్డారని చియాపాస్ స్టేట్ సివిల్ ఢిఫెన్స్ ఆఫీస్ అధికారి లూయీస్ మాన్యూయెల్ మోరెనో తెలిపారు. వారందరినీ స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. చియాపాస్ రాజధాని వైపు వెళ్లే ఓ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
రోడ్డు ప్రమాదంలో మృతులు
రోడ్డు ప్రమాదంలో మృతులు

సామర్థ్యానికి మించి..

Mexico migrant truck crash: బాధితులంతా మధ్య అమెరికన్లుగా తెలుస్తోంది. అయితే.. కచ్చితంగా వారు ఏ దేశానికి చెందినవారనే వివరాలు ఇంకా అధికారులు ధ్రువీకరించలేదు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ కొంతమంది తాము గ్వాటెమాలా దేశస్థులమని తెలిపారని మాన్యూయెల్ మోరెనో తెలిపారు. ట్రక్కు సామర్థ్యానికి మించి జనం ప్రయాణించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.

రక్తం కారుతున్నా పరుగులు...

ఘటనా సమయంలో ట్రక్కులో 107 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. అయితే... ఇమ్మిగ్రేషన్ ఏజెంట్స్​కు భయపడిన కొంతమంది వలసదారులు భయంతో ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయారని సహాయక సిబ్బంది ఒకరు తెలిపారు. ఘటనాస్థలి నుంచి పరుగులు తీసిన బాధితుల్లో చాలా మందికి గాయాల కారణంగా రక్తం కారుతోందని ఓ వైద్యుడు తెలిపారు. అయినప్పటికీ వైద్యం చేయించుకోకుండానే పరారయ్యారని పేర్కొన్నారు.

గ్వాటెమాలా అధ్యక్షుడి విచారం..

ఈ ప్రమాదంపై గ్వాటెమాలా అధ్యక్షుడు అలెజాండ్రో గియామ్మట్టే ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం వేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులను స్వదేశానికి తరలించడం సహా తగిన సహాయం తాము చేస్తామని ప్రకటించారు.

ఇదీ చూడండి:కుమార్తె పుట్టినరోజునే విషాదం- దొంగల కాల్పుల్లో తండ్రి మృతి

ఇదీ చూడండి:'నయాగరా'లో పడిన కారు.. ఆమెను కాపాడేందుకు భారీ అడ్వెంచర్

Last Updated : Dec 10, 2021, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details