తుపాకీల మోతతో మెక్సికో కోహూయిలా రాష్ట్రంలోని విల్లా యూనియన్ పట్టణం దద్దరిల్లింది. ట్రక్కుల్లో వచ్చిన దుండగులు.. ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. వారిని నిలువరించే క్రమంలో భద్రతా సిబ్బంది, దుండగుల మధ్య సుమారు గంటపాటు భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు భద్రతా సిబ్బంది. స్థానిక పురపాలక సంస్థలో పనిచేసే కొంత మంది కార్మికుల ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
దాడి చేసింది ఈశాన్య ప్రాంతానికి చెందిన మాదకద్రవ్యాల ముఠా అని అనుమానిస్తున్నారు పోలీసులు.