తెలంగాణ

telangana

ETV Bharat / international

మాస్క్ ధరిస్తే సరిపోతుందా.. భౌతిక దూరం అక్కర్లేదా? - Study on coronavirus masks

కొవిడ్ బారిన పడకుండా ఉండాలంటే మాస్క్​ ధరిస్తే సరిపోతుందా? అంటే కాదనే అంటున్నారు నిపుణులు. ఈ మేరకు నిర్వహించిన తాజా అధ్యయనంలో మాస్క్​తో పాటు భౌతిక దూరమూ పాటించాలని తేలింది. అలా చేయకపోతే కరోనా సోకే అవకాశాలు మెండుగా ఉన్నట్లు వెల్లడైంది.

Masks alone may not stop COVID-19 spread without physical distancing, study says
మాస్క్ ధరిస్తే సరిపోతుందా-భౌతిక దూరం అక్కర్లేదా?

By

Published : Dec 23, 2020, 8:30 PM IST

కరోనా రాకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించకుండా కేవలం మాస్క్​ ధరిస్తే సరిపోదని తాజా అధ్యయనంలో తేలింది. మాస్క్​ ధరిస్తే కరోనా వ్యాప్తి తగ్గొచ్చు. అయితే మాస్క్​ ధరించి 6 అడుగులు లేదా రెండు మీటర్ల భౌతిక దూరం పాటించకపోతే కరోనా బారిన పడే ప్రమాదం అధికంగా ఉన్నట్లు వెల్లడైంది.

మాస్క్​ ధరించి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు ఎంత దూరం వ్యాపిస్తాయనే విషయంలో సాధారణ వస్త్రంతో తయారు చేసిన మాస్క్​, రెండు పొరల మాస్క్​, సర్జరికల్​ మాస్క్​, ఎన్​-95 మాస్క్​ వంటి ఐదు రకాల మాస్కులపై పరిశోధన చేసింది అమెరికాకు చెందిన న్యూ మెక్సికో స్టేట్​ విశ్వవిద్యాలయం.

ఈ అధ్యయనం 'ఫిజిక్స్ ఆఫ్​ ఫ్లూయిడ్స్​' జర్నల్​లో ప్రచురితమైంది.

"కరోనా సోకకుండా ఉండటానికి మాస్కులు ఉపయోగపడతాయి. అయితే ప్రజలు భౌతిక దూరం పాటించకపోతే వైరస్​ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మాస్క్​ ధరిస్తే సరిపోదు. భౌతిక దూరం కూడా పాటించాలి" అని వర్సిటీ ప్రొఫెసర్​ కృష్ణ కోట అన్నారు.

సాధారణ వస్త్రంతో తయారు చేసిన మాస్క్​ నుంచి 3.6శాతం తుంపర్లు బయటకు వస్తున్నాయని తేల్చింది ఈ పరిశోధన. అయితే.. ఎన్​-95 మాస్క్ 100 శాతం బిందవులు బయటకు రాకుండా ఆపగలదని వెల్లడించింది. సాధారణంగా ఓ వ్యక్తి తుమ్మినప్పుడు 200 మిలియన్ల నీటి బిందువులు​ బయటకు వస్తాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఆ 15 మందికి ట్రంప్ క్షమాభిక్ష ​

ABOUT THE AUTHOR

...view details