తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్వేత జాత్యహంకారికి 419 ఏళ్ల జైలు శిక్ష - 419 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలో జాత్యహంకారం నేరానికి పాల్పడిన తెల్లజాతీయుడు జేమ్స్​ అలెక్స్​ ఫీల్డ్​కు 419 ఏళ్లు జైలు శిక్ష విధించింది చార్లెట్స్​విల్లే న్యాయస్థానం. 2017లో జాత్యహంకార వ్యతిరేక నిరసనకారులపై కారుతో దూసుకెళ్లి ఒక వ్యక్తి చావుకు కారణమయ్యాడు జేమ్స్​.

అమెరికాలో శ్వేత జాత్యహంకారికి 419 ఏళ్ల జైలు

By

Published : Jul 16, 2019, 3:49 PM IST

అమెరికాలో జాత్యహంకార నేరానికి పాల్పడిన తెల్లజాతీయుడు జేమ్స్​ అలెక్స్​ ఫీల్డ్స్(22)కు.. 419 సంవత్సరాల జైలు శిక్ష విధించింది వర్జీనియా చార్లెట్స్​విల్లే సర్క్యూట్ న్యాయస్థానం. 2017 ఆగస్టు 12న చార్లెట్స్​విల్లే నగరంలో జరిగిన 'యునైట్ ద రైట్'​ ర్యాలీ సందర్భంగా నిరసనకారులపైకి కారుతో వేగంగా దూసుకొచ్చాడు ఫీల్డ్స్. ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, డజన్ల మంది గాయపడ్డారు.

గత నెల్లోనే 29 కేసుల్లో కోర్టు ఫీల్డ్స్​కు జీవిత ఖైదు విధించింది.

స్టేట్ జ్యూరీ సిఫార్సు మేరకు న్యాయమూర్తి రిచర్డ్ మూర్ జేమ్స్​కు తాజాగా 419ఏళ్ల జైలు శిక్ష విధించారు.

ఏం జరిగింది?

అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని చార్లెట్స్​విల్లే నగరంలో కాన్​ఫెడెరేట్​ జనరల్​ రాబర్ట్​ ఈ లీ విగ్రహం తొలగింపునకు నిరసనగా తెల్ల జాతీయులు ర్యాలీ చేపట్టారు. ఫీల్డ్స్​ కూడా ఒహాయోలోని మయామీ నుంచి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నాడు.

ఈ ర్యాలీకి వ్యతిరేకంగా మరికొంత మంది నిరసనలు వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. తరువాత ఫీల్డ్స్ తన కారుతో వ్యతిరేక నిరసనకారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో హెదర్​ హెయర్​ (32) మరణించగా, 24 మందికి పైగా గాయపడ్డారు.

ఈ సంఘటనతో అమెరికాలో జాతివైరం పెరిగిపోయి ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై ట్రంప్​ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి.

ఇదీ చూడండి:వాషింగ్టన్​లో కారులే పడవలయ్యాయి..!

ABOUT THE AUTHOR

...view details