తెలంగాణ

telangana

By

Published : Feb 2, 2021, 6:02 AM IST

ETV Bharat / international

మంచు తుపాను బీభత్సం- వణుకుతోన్న అమెరికా

అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. బలమైన గాలులకు తోడు దట్టమైన హిమం పేరుకుపోయి పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాలిఫోర్నియాలో ఓ జాతీయ రహదారి ధ్వంసమైంది. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Major storm hits Northeast, more than foot of snow forecast
మంచు తుపాను బీభత్సం- వణుకుతోన్న అమెరికా

మంచు తుపానుతో అమెరికా తూర్పు ప్రాంతం వణుకుతోంది. న్యూయార్క్​, న్యూజెర్సీ వంటి నగరాల్లో కరోనా వ్యాక్సినేషన్​ కేంద్రాలు, విద్యాసంస్థలు మూసివేశారు. ఇక్కడి రోడ్లపై 22 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. రవాణా సైతం నిలిచిపోయింది.

రోడ్లపై భారీగా పేరుకుపోయిన మంచు
మంచు వర్షం
మంచును తొలగిస్తున్న యంత్రాలు

పెన్సిల్వేనియాలో మంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి తోడు బలమైన గాలులు వీస్తున్నాయి. ఇది ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. రోడ్లపై మంచు దట్టంగా పేరుకుపోయింది.

శ్వేతవర్ణంగా న్యూయార్క్​ రోడ్లు
మంచును తొలగిస్తున్న యంత్రాలు

పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే అవకాశాలున్నందున.. ప్రజలు అత్యవసరం అయితే తప్పు ప్రయాణాలు మానుకోవాలని సూచించారు గవర్నర్​. ఫిలడెల్ఫియా, పిట్స్​బర్గ్​ ప్రాంతాల్లోనూ మంచు భారీగా కురుస్తోంది.

రోడ్లపై దట్టంగా పేరుకుపోయిన మంచు
మంచులో మునిగిపోయిన కార్లు

మంచు తొలగిస్తూ ఉల్లాసంగా..

టైమ్స్​ స్క్వేర్​ వద్ద చాలా మంది తమ వ్యాపార, వాణిజ్య సముదాయాలను తెరిచేందుకు మంచును తొలగిస్తున్నారు. అయితే.. ఆ మంచు సోయగాల్లో కొందరు ఉల్లాసంగా గడుపుతున్నారు. శ్వేతవర్ణాన్ని ఆస్వాదిస్తున్నారు.

టైమ్స్​ స్క్వేర్​ వద్ద
మంచులోనే వ్యాపారాలు
మంచులో ఆటలు

న్యూయార్క్​లోని జాన్​ఎఫ్​ కెనడీ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన అన్ని వాణిజ్య విమానాలను రద్దు చేశారు. బుధవారం వరకూ.. బలమైన గాలులు, మంచు కురుస్తుందని అమెరికా వాతావరణ విభాగం తెలిపింది.

రోడ్డు ధ్వంసం..

కాలిఫోర్నియాలోని బిగ్​ సుర్​ ప్రాంతం సమీపంలో భారీ వర్షాలు, మంచు కారణంగా రహదారి ధ్వంసమైంది. ఈ కారణంగా.. తీర ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి.

కాలిఫోర్నియాలో జాతీయ రహదారి ధ్వంసం
ధ్వంసమైన రహదారి

ఇదీ చూడండి:మయన్మార్​లో సైనిక తిరుగుబాటు- ఖండించిన ప్రపంచ దేశాలు

ABOUT THE AUTHOR

...view details