తెలంగాణ

telangana

ETV Bharat / international

లాక్‌డౌన్​ వ్యతిరేక ఉద్యమానికి ట్రంప్ మద్దతు - కరోనా లేటెస్ట్ న్యూస్

అమెరికాలో లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకు విముఖత చూపుతున్న రాష్ట్రాలపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డెమొక్రాట్‌ గవర్నర్లు పాలిస్తున్న రాష్ట్రాల్లో ప్రజలు తెలుపుతున్న నిరసనలకు ట్రంప్ మద్దతు తెలిపారు.

trump
ట్రంప్ మద్దతుతో నిరసనలు

By

Published : Apr 18, 2020, 11:48 AM IST

అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకే మొగ్గుచూపుతున్నారు. ఆంక్షలు సడలించేందుకు విముఖత చూపుతున్న డెమొక్రాట్‌ పాలిత రాష్ట్రాలపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అమెరికావ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకు ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది ట్రంప్ ప్రభుత్వం.

మద్దతు

'స్టే ఎట్‌ హోమ్‌' నిబంధనల సడలింపు డిమాండ్‌తో నిరసనలు తెలుపుతున్న వారికి ట్రంప్ పరోక్షంగా మద్దతు తెలిపారు. ఈ మేరకు "లిబరేట్‌ మిన్నెసొటా, లిబరేట్‌ మిషిగన్‌, లిబరేట్‌ వర్జీనియా" అంటూ వరుస ట్వీట్‌లు చేశారు దేశాధ్యక్షుడు.

ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కూమోపైనా ట్రంప్ విమర్శలు చేశారు. 'కూమో పని చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టండి, ఫిర్యాదులు చేయడంపై కాదు' అంటూ ప్రతిదాడికి దిగారు.

అయితే నిబంధనలు సడలించినప్పటికీ ప్రజల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

నిరసనలు..

నిబంధల సడలింపు డిమాండ్‌తో దాదాపు 1,000 మంది ట్రంప్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.

మరోవైపు రెండు రాష్ట్రాల్లో నిబంధనల సడలిపునకు రిపబ్లికన్‌ గవర్నర్లు కసరత్తు ముమ్మరం చేశారు.

అయితే తక్కువ జనాభా, ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ఉన్న రాష్ట్రాల గవర్నర్లు మాత్రం నిబంధనల సడలింపునకు మొగ్గుచూపడం లేదు. వ్యాపారాలను వేగంగా పునరుద్ధరించాలనే తొందరేంలేదు అని వయోమింగ్, మైనీ, సౌత్ డకోటా రాష్ట్రాల గవర్నర్లు అభిప్రాయపడ్డారు.

అమెరికాలో ఇప్పటి వరకు 710,000 మందికి పైగా కరోనా సోకింది. 37,158 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:ట్రంపరితనానికి కళ్లెం వేసిన కరోనా!

ABOUT THE AUTHOR

...view details