తెలంగాణ

telangana

ETV Bharat / international

'వ్యాక్సిన్​ తీసుకున్నా.. మాస్కు తప్పనిసరి' - కరోనా వ్యాక్సినేషన్​పై ఆంటోనీ ఫౌచీ

వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించడంపై ప్రజలు అశ్రద్ధ చేయకూడదని అమెరికా అంటువ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్​ ముగిసే నాటికి కరోనా జాగ్రత్తలకు స్వస్తి పలకొచ్చని అన్నారు.

DR. Fauci
వ్యాక్సిన్​ తీసుకున్నా మాస్కు తప్పనిసరి: ఫౌచీ

By

Published : Feb 13, 2021, 6:08 AM IST

కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతున్నా.. మాస్క్ ధరించడం తప్పనిసరి అని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సూచించారు. 75 నుంచి 80 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి వైరస్​ వ్యాప్తి సామర్థ్యం చాలా మేరకు తగ్గుతుందని పేర్కొన్నారు.

వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చోట మాస్క్‌పై మాస్క్‌ ధరించడం వల్ల మరింత రక్షణ లభిస్తుందని మొదటి నుంచి ఫౌచీ చెప్పుకొచ్చారు. టీకా ప్రక్రియ పూర్తిగా ముగిసే నాటికి కరోనా నిబంధనలకు నెమ్మదిగా స్వస్తి చెప్పొచ్చని అన్నారు. ప్రస్తుతం అమెరికాలో 600 మిలియన్ డోసుల వ్యాక్సిన్లు ఉన్నాయని ఫౌచీ తెలిపారు.

ఇదీ చదవండి:'మాస్క్‌పై మాస్క్‌తో ప్రయోజనమెక్కువ'

ABOUT THE AUTHOR

...view details