తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్, హారిస్‌ విజయాన్ని ఖరారు చేసిన కాంగ్రెస్​ - అమెరికా వార్తలు

JOINT SESSION OF US CONGRESS
అమెరికా కాంగ్రెస్​ సంయుక్త సమావేశం

By

Published : Jan 7, 2021, 12:34 AM IST

Updated : Jan 7, 2021, 3:17 PM IST

14:16 January 07

బైడెన్​కు ఎన్ని ఓట్లంటే..

అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఖరారయ్యారు. ఈమేరకు బైడెన్​, కమల విజయాన్ని ఎలక్టోరల్ ఓట్ల ఆధారంగా అమెరికా కాంగ్రెస్​ ధ్రువీకరించింది. అధికారం చేపట్టేందుకు 270 ఓట్లు అవసరం కాగా... బైడెన్​కు 306 ఓట్లు వచ్చినట్లు తేల్చింది. ఈనెల 20న బైడెన్, కమల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బైడెన్​ విజయాన్ని అమెరికా కాంగ్రెస్​ ధ్రువీకరించిన కాసేపటికే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 20న బైడెన్​కు అధికార మార్పిడి సజావుగా సాగుతుందని స్పష్టం చేశారు.

14:12 January 07

బైడెన్, హారిస్‌ విజయం ఖరారు

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ఖరారయ్యారు.  జో బైడెన్‌ విజయాన్ని అమెరికా ఎలక్టోరల్ కాలేజ్ ధ్రువీకరించింది.

10:46 January 07

52 మంది ఆందోళనకారుల అరెస్టు

  • అమెరికా క్యాపిటల్ భవనం వద్ద ఘటనలో పలువురు అరెస్టు
  • 52 మంది ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు

09:41 January 07

ట్రంప్ యంత్రాంగంలో పలువురు రాజీనామా!

  • ఉద్రిక్తతలకు బాధ్యత వహిస్తూ ట్రంప్ యంత్రాంగంలో పలువురు రాజీనామా
  • అధికారులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం
  • మెలానియా ట్రంప్ చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ స్టెఫానీ గ్రీషమ్ రాజీనామా
  • వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సారా మాథ్యూ రాజీనామా
  • వైట్ హౌస్ సోషల్ సెక్రటరీ రికీ నెక్టా సైతం రాజీనామా చేసినట్లు సమాచారం
  • రాజీనామా చేసే యోచనలో జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్‌
  • పలువురు ట్రంప్ సహాయకులు రాజీనామా యోచనలో ఉన్నట్లు సమాచారం

07:51 January 07

సమావేశం తిరిగి ప్రారంభం

  • బైడెన్‌ ఎన్నిక ధ్రువీకరణ సమావేశం తిరిగి ప్రారంభం
  • క్యాపిటల్ భవనంలో పరిస్థితి అదుపులోకి రావడంతో ప్రక్రియ మళ్లీ ప్రారంభం

05:01 January 07

మహిళ మృతి

అమెరికా క్యాపిటోల్​ భవనం వద్ద చెలరేగిన ఘర్షణల్లో తూటా తగిలిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.  

04:56 January 07

'క్యాపిటోల్​​ భవనం సురక్షితం'

అమెరికా క్యాపిటోల్​​ భవనం వద్ద అధ్యక్షుడు ట్రంప్​ మద్దతుదారులు చేపట్టిన ఆందోళన సుమారు నాలుగు గంటల పాటు సాగింది. భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అదనపు బలగాలను మోహరించి వారిని నిలువరించారు. నిరసనకారులందరినీ పంపించి వేసిన పోలీసులు క్యాపిటోల్​ సురక్షితమే అని ప్రకటించారు. 

03:12 January 07

ఇళ్లకు వెళ్లాలని ఆందోళనకారులకు ట్రంప్​ పిలుపు

అమెరికా క్యాపిటోల్​​ వద్ద ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో శాంతియుతంగా ఉండాలని పేర్కొన్న అధ్యక్షుడు ట్రంప్​.. ఓ వీడియో సందేశాన్ని పంపారు. మన నుంచి ఎన్నికలను దొంగిలించారని మరోమారు ఆరోపించారు. ఇవి ఘోరమైన ఎన్నికలని ప్రతి ఒక్కరికి తెలుసునని, ముఖ్యంగా ప్రత్యుర్థులకు తెలుసునన్నారు. అయినప్పటికీ.. ప్రస్తుతానికి అందరు ఇళ్లకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఎవరినీ బాధపెట్టాల్సిన అవసరం లేదని, తమకు శాంతి, శాంతిభద్రతలు కావాలాని పేర్కొన్నారు. 

03:02 January 07

ఆందోళనలకు స్వస్తి పలికేలా ట్రంప్​ చర్యలు తీసుకోవాలి: బైడెన్​

అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మద్దతుదారులు అమెరికా క్యాపిటోల్​​ వద్ద చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీసిన క్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. క్యాపిటోల్​​ ముట్టడికి స్వస్తి పలికేలా అధ్యక్షుడు ట్రంప్​ వెంటనే చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 'తన ప్రమాణాన్ని నిలబెట్టుకునేలా ట్రంప్​ వెంటనే నేషనల్​ టెలివిజన్​ వద్దకు మద్దతుదారులను వెనక్కి పిలిచి.. రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతున్నా. ఈ ముట్టడికి స్వస్తి పలకాలని డిమాండ్​ చేస్తోన్న. ప్రస్తుతం మన రాజ్యాంగం ఎన్నడూ లేనివిధంగా దాడికి గురవుతోంది. ఈ ఆధునిక కాలంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. ప్రజాప్రతినిధులు, క్యాపిటోల్​​ హిల్​ పోలీసులపై దాడి జరుగుతోంది. '  అని పేర్కొన్నారు.  

02:17 January 07

ఆందోళనకారుల్లో ఒకరికి తూటా గాయాలు

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్​ ఎన్నికను ధ్రువీకరించేందుకు అగ్రరాజ్య కాంగ్రెస్​ సమావేశమైంది. ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మద్దతుదారులు అధికారక భవనం క్యాపిటోల్​ వద్ద ఆందోళనకు చేపట్టారు. అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఆందోళనల్లో తుపాకుల మోత మోగింది. ఓ వ్యక్తికి తూటా గాయమైనట్లు సమాచారం. అయితే.. అతని పరిస్థితి ఏమిటనేది తెలియలేదు.  

క్యాపిటోల్​కు అదనపు బలగాలు: శ్వేతసౌధం

రిపబ్లికన్​ మద్దతుదారులతో అమెరికా క్యాపిటోల్​ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో ఆందోళనలను అదుపు చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్​ ఆదేశాలతో నేషనల్​ గార్డ్స్​, ఇతర ఫెడరల్​ భద్రతా సేవా విభాగాల బలగాలను తరలిస్తున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి మెక్​ఎనానీ ట్వీట్​ చేశారు.  

02:04 January 07

చట్టాలు, పోలీసులను గౌరవించాలి: ట్రంప్​

అమెరికా కాంగ్రెస్​ సంయుక్త సమావేశం సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ చేపట్టిన మద్దతుదారులు శ్వేతసౌధం పోలీసులకు సహకరించారని కోరారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. క్యాపిటోల్​ వద్ద పోలీసులతో ఘర్షణ వాతావరణ తలెత్తగా ఈ మేరకు ట్వీట్​ చేశారు. 'క్యాపిటోల్​ పోలీసులు, అధికారులకు మద్దతు ఇవ్వండి. వారు నిజంగా మన దేశంవైపునే ఉన్నారు. శాంతి యుతంగా ఉండాలి. అమెరికా కాంగ్రెస్​ వద్ద ఉన్న ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఉండాలని కోరుతున్నా. హింస వద్దు. మనమంతా శాంతిభద్రతలకు కట్టుబడి ఉన్నామని గుర్తుంచుకోవాలి. చట్టాలు, పోలీసులను గౌరవించాలి. ' అని పేర్కొన్నారు.  

01:01 January 07

పోలీసులతో ట్రంప్​ మద్దతుదారుల ఘర్షణ

అమెరికా అధ్యక్ష ఎన్నికల విజయాన్ని అధికారికంగా ధ్రువీకరించేందుకు ఆ దేశ కాంగ్రెస్​ సమావేశమైంది. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మద్దతుదారులు, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. దాంతో చట్టసభ్యులు లోపల ఉండగానే సమావేశ భవనాన్ని మూసివేశారు అధికారులు.  

అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​ విజయాన్ని అధికారికంగా ధ్రువీకరించేందుకు అమెరికా చట్టసభ్యులు సమావేశమైన క్రమంలో శ్వేతసౌధం ప్రాంగణంలో భద్రతకు భంగం కలిగినట్లు యూఎస్​ క్యాపిటోల్​ పోలీసులు తెలిపారు. బయటి నుంచి భద్రతా ముప్పు పొంచి ఉన్న క్రమంలో లోపలి వారు బయటకి, బయటి వారు లోపలికి వెళ్లేందుకు వీలులేదని స్పష్టం చేశారు.  

పలువురు ఆందోళనకారులు భద్రతా సిబ్బందిని నెట్టివేస్తూ..  బారికేడ్లను తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని చేదరగొట్టేందుకు పెప్పర్​ స్ప్రే చల్లారు. కొందరు దేశద్రోహ అధికారులు మమ్మల్ని వెనక్కి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని నినదించారు నిరసనకారులు.

00:42 January 07

ట్రంప్​కు ఎదురు దెబ్బ..

అమెరికా కాంగ్రెస్​ సమావేశానికి కొద్ది సమయం ముందు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ను పావుగా వాడుకొను అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోన్న ఆలోచనలకు చెక్​పెట్టారు పెన్స్​. తాను రాజ్యాంగ నియమాలనే పాటిస్తానని పేర్కొంటూ కాంగ్రెస్​కు లేఖ రాశారు పెన్స్​. రాజ్యాంగానికి మద్దతు ఇవ్వటం, రక్షించటానికి తాను చేసిన ప్రమాణం.. ఓట్ల లెక్కింపులో ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అడ్డుకుంటుందన్నారు. ఈ ఏడాది ఎన్నికల చుట్టూ వివాదం చెలరేగిందని, కొందరు తాను ఎలక్టోరల్​ ఓట్ల లెక్కింపును ఏకపక్షంగా ఆమెదించటం, తిరస్కరించటం చేస్తానని భావించారన్నారు. అలాగే కొందరు సంయుక్త సమావేశంలో సవాలు చేయలేరని భావిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని క్షుణ్నంగా చదివిన తర్వాత.. తనకు ఎలాంటి అధికారం లేదని స్పష్టమవుతోందన్నారు. 

00:18 January 07

ప్రారంభమైన కొద్ది సేపటికే అభ్యంతరాల వెల్లువ

అధ్యక్షుడిని అధికారికంగా ఎన్నుకునేందుకు అమెరికా కాంగ్రెస్​ సంయుక్త సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎలక్టోరల్​ కాలేజీ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. కానీ, కొద్ది సమయంలోనే ఆరిజోనా ఎన్నికలపై అభ్యంతరం వ్యక్తం చేశారు రిపబ్లికన్​ చట్టసభ్యులు. ఈ క్రమంలో సభను వాయిదా వేశారు సభకు అధ్యక్షత వహించిన ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​. అభ్యంతరాలపై చర్చ, ఓటింగ్​కు ఆదేశించారు. ఇరు సభలకు రెండు గంటల సమయం కేటాయించారు.

Last Updated : Jan 7, 2021, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details