తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ ప్రసంగంతో బైడెన్​కు తగ్గిన మద్దతు! - డొనాల్డ్​ ట్రంప్​

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్​-బైడన్​ మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్​ కన్వెన్షన్​లో ట్రంప్​ చేసిన ప్రసంగంతో బైడన్​కు మద్దతు తగ్గిందని ఓ సర్వే వెల్లడించింది. ఇది కచ్చితంగా ట్రంప్​నకు కలిసొచ్చే విషయమని పేర్కొంది.

Joe Biden's lead over Trump narrows after Republican National Convention: poll
ట్రంప్​ ప్రసంగంతో బైడెన్​కు తగ్గుతున్న మద్దతు!

By

Published : Aug 30, 2020, 5:10 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. తాజాగా.. రిపబ్లికన్​ కన్వెన్షన్​లో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన ప్రసంగంతో.. డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్​కు మద్దతు తగ్గుతోందని పోల్స్​ చెబుతున్నాయి.

ది హిల్​ నివేదించిన మార్నింగ్​ కన్సల్ట్​ సర్వే ప్రకారం.. ప్రస్తుతం బైడెన్​కు 50శాతం అమెరికన్ల మద్దతుంది. ట్రంప్​నకు 44శాతం. ఎవరికి ఓటు వేయాలో ఇంకా తేల్చుకోని వారిది 7శాతం. అయితే రిపబ్లికన్​ కన్వెన్షన్​ ప్రారంభమయ్యే నాటికి(ఆగస్టు 23) ట్రంప్​పై బైడన్​కు 52-42 లీడ్​ ఉంది.

ట్రంప్​నకు కొంత మద్దతు పెరిగినప్పటికీ.. ఆయనపై బైడన్​ ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు ఈ పోల్​ స్పష్టం చేస్తోంది.

అయితే రిపబ్లికన్​ కన్వెన్షన్​ ట్రంప్​నకు సహాయపడిందని ది హిల్​ పేర్కొంది. తన​ ప్రసంగంతో శ్వేతజాతి ఓటర్ల మద్దతును ట్రంప్​ మరింత పొందినట్టు వెల్లడించింది.

ఇదీ చూడండి:-డొనాల్డ్​ ట్రంప్​ ప్రసంగంపై నిపుణులు ఏమన్నారంటే..?

ABOUT THE AUTHOR

...view details