తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్యూర్టోరికో ప్రైమరీల్లో జో బైడెన్​ ఘన విజయం - ప్యూర్టోరికో ప్రైమరీలో బైడెన్​ విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు గెలవాల్సిన ప్రైమరీల్లో ఇప్పటికే జయకేతనం ఎగరేశారు డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్. తాజాగా ప్యూర్టోరికో నుంచి ఆయన ప్రైమరీల్లో విజయం సాధించారు.

Joe Biden wins Democratic primary in Puerto Rico
ప్యూర్టో రికో ప్రైమరీలో జో బైడెన్​ ఘన విజయం

By

Published : Jul 13, 2020, 5:19 AM IST

Updated : Jul 13, 2020, 5:51 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున పోటీ చేసేందుకు నిర్వహించే ప్రైమరీల్లో డెమొక్రాటిక్​ పార్టీ నేత జో బైడెన్​ ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఆదివారం ప్యూర్టోరికోలో జరిగిన ఈ ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులను ఎదుర్కొన్నారు బైడెన్​. ఫలితంగా పార్టీ నుంచి నామినేట్​ అయ్యేందుకు బైడెన్​కు కావల్సినంత బలం సమకూరినట్లైంది. ఇప్పటికే మెజారిటీ ప్రైమరీల్లో గెలిచిన నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది.

వాస్తవానికి ఈ ప్రైమరీ ఎన్నికలు ఈ ఏడాది మార్చిలోనే జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా జులై 12కు వాయిదాపడ్డాయి.

ఇదీ చదవండి:బెర్నీ-బైడెన్​ భాయిభాయి.. ట్రంప్ భవిష్యత్తు ఏం కానుంది?

Last Updated : Jul 13, 2020, 5:51 AM IST

ABOUT THE AUTHOR

...view details