తెలంగాణ

telangana

ETV Bharat / international

బహిరంగంగానే టీకా తీసుకుంటా: బైడెన్‌ - america covid

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్‌ కూడా బహిరంగంగానే టీకా తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. అమెరికన్లకు టీకాపై నమ్మకం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

Joe Biden ready to publicly get  covid Vaccine
బహిరంగంగానే టీకా తీసుకుంటా: బైడెన్‌

By

Published : Dec 4, 2020, 10:48 PM IST

వ్యాక్సిన్‌పై అమెరికన్లలో నెలకొన్న అపోహను తొలగించే దిశగా బహిరంగంగా టీకా వేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్‌ అన్నారు. వ్యాక్సిన్‌ సమర్థతపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్న ఆయన.. వ్యాక్సిన్‌ తీసుకోవడం సురక్షితమన్న విషయాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వచ్చే నెల జరిగే ప్రమాణా స్వీకారానికి ట్రంప్‌ హాజరుకావట్లేదన్న వార్తలపై బైడెన్‌ స్పందించారు. ప్రస్తుతం నెలకొన్న గందరగోళాన్ని తెరతీసేందుకు ఆ కార్యక్రమానికి ట్రంప్‌ హాజరుకావడం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్​ ఒబామా, జార్జిబుష్‌, బిల్​క్లింటన్‌ వంటి నేతలు బహిరంగంగానే టీకా వేయించుకుంటామని ప్రకటించారు. అమెరికా అగ్రనాయకులు వరుసగా ఇలా టీకా వేసుకునేందుకు రావడంపై అక్కడి వైద్య నిపుణులు స్వాగతిస్తున్నారు.

ఇదీ చూడండి: బ్రిటీష్ ఇండియన్​ పుస్తకానికి 'చారిత్రక' అవార్డ్

ABOUT THE AUTHOR

...view details