తెలంగాణ

telangana

ETV Bharat / international

జెఫ్​ కూన్​ 'కుందేలు' ధర రూ.638 కోట్లు - us

అమెరికా ప్రఖ్యాత కళాకారుడు జెఫ్​ కూన్​ చెక్కిన కుందేలు బొమ్మ రికార్డు సృష్టించింది. వేలంలో రూ.638 కోట్లకు అమ్ముడుపోయింది.

జెఫ్​ కూన్​ కుందేలు

By

Published : May 16, 2019, 5:31 PM IST

జెఫ్​ కూన్​ కుందేలు

అమెరికా ప్రఖ్యాత కళాకారుడు రూపొందించిన ఉక్కు కుందేలు వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. న్యూయార్క్​లో క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో 91.1 మిలియన్ డాలర్లు (రూ. 638 కోట్లు) కుమ్మరించారు. జీవించి ఉన్న ఓ కళాకారుడి బొమ్మకు ఇంత ధర రావటం ఇదే మొదటిసారి.

వేలంలో పలికిన ధర 80 మిలియన్ డాలర్లే అయినా పన్నులు, ఇతరత్రా రుసుములు కలిపి 91.1 మిలియన్ డాలర్లకు చేరుతుంది. "ర్యాబిట్​"ను కూన్​ 1986లో తయారు చేశారు. అప్పట్లోనే ఈ కళాఖండాన్ని అనేక మంది మెచ్చుకున్నారు.

తుప్పు పట్టని ఉక్కుతో కూన్​ తయారు చేసిన కుందేలు... బ్రిటీష్ చిత్రకారుడు డేవిడ్​ హాక్నీ చిత్రం "పోట్రైట్​​ ఆఫ్​ యాన్​ ఆర్టిస్ట్​" 90.3 మిలియన్​ డాలర్ల రికార్డును బద్దలు కొట్టింది. 2013లో కూన్​ రూపొందించిన "బెలూన్​ డాగ్​" 58 మిలియన్​ డాలర్లకు అమ్ముడుపోయింది. ఐదేళ్ల పాటు ఆ రికార్డును తిరగరాయడం ఎవరికీ సాధ్యంకాలేదు.

ఇదీ చూడండి: 23సార్లు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి నేపాలీ రికార్డు

ABOUT THE AUTHOR

...view details