తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా రక్షణ మంత్రితో జై శంకర్ భేటీ

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్​తో సమావేశమయ్యారు. శుక్రవారం జరిగిన ఈ భేటీలో.. ఇరుదేశాల మధ్య భద్రతా సవాళ్లపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

jai shankar
జైశంకర్

By

Published : May 29, 2021, 5:46 AM IST

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌ల మధ్య శుక్రవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం దిశగా చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అంతేగాక భద్రతా సవాళ్లపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపింది.

ఈ మేరకు లాయిడ్​తో కలసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్న విదేశాంగ మంత్రి జై శంకర్..​ సమకాలీన భద్రతా సవాళ్లపై చర్చించినట్లు పేర్కొన్నారు. చైనా తన సైనిక శక్తిని క్రమంగా పెంచుకుంటున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిస్థితిపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. జో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత అమెరికాలో పర్యటిస్తున్న మొదటి భారత కేబినెట్ మంత్రి జైశంకర్ కావడం విశేషం.

భారత్​లో కరోనా రెండోదశపై పోరులో భాగంగా అమెరికా సైన్యం స్పందించిన తీరుని జైశంకర్ప్రశంసించారు. భారత్​కు అవసరమైన వైద్య పరికరాలు, సామాగ్రిని అమెరికా సైన్యం సరఫరా చేస్తోంది.

విస్తృత చర్చలు..

అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూతోనూ జైశంకర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆరోగ్య సంరక్షణ, డిజిటల్, నాలెడ్జ్ రంగాలు సహా.. ఇండో-పసిఫిక్, భారత్​-అమెరికా భాగస్వామ్యానికి సంబంధించి కీలక అంశాలపై విస్తృత చర్చలు జరిగినట్లు భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ పర్యటనలో భాగంగా.. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన, భారత అనుకూలురైన శాసనకర్తలతో జైశంకర్ వరుస సమావేశాలు జరిపారు. క్వాడ్ అంశంతో పాటు.. టీకాల సహకారం గురించి చర్చించారు.

ఇవీ చదవండి:భారత్​లో అమెరికా రాయబారిగా లాస్​ ఏంజెలెస్​​ మేయర్​!

అమెరికా పర్యటనలో జైశంకర్​ బిజీబిజీ

అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతో జైశంకర్ భేటీ

ABOUT THE AUTHOR

...view details