ఇవర్‌మెక్టిన్ అనే ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. కొవిడ్‌ను చాలా వరకూ దరిచేరకుండా చూసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా మహమ్మారికి ముగింపు పలకడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. ఇవర్‌మెక్టిన్ అనేది నోటిద్వారా తీసుకునే ఔషధం. వివిధ పరాన్న జీవులతో సంక్రమించే ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి దీన్ని వైద్యులు సూచిస్తుంటారు. తాజాగా.. వైద్యనిపుణులు, శాస్రవేత్తలతో కూడిన ఫ్రంట్‌లైన్ కొవిడ్-19 క్రిటికిల్ కేర్ అలయెన్స్, ఎఫ్ఎల్సీసీసీ సంస్థ ఈ ఔషధంపై పరిశోధన చేసింది. ఆ వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ థెరాప్టిక్స్లో ప్రచురితంమయ్యాయి. ఇవర్మెక్టిన్పై జరగిన క్లినికల్, ల్యాబ్, జంతు పరిశోధనల్లో వెలువడిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
కొవిడ్‌ను దరిచేరనివ్వని ఇవర్‌మెక్టిన్!
కరోనా మహమ్మారికి ముగింపు పలకడానికి ఇవర్‌మెక్టిన్ అనే ఔషధం దోహదపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే కొవిడ్‌ను కొంతమేర దరిచేరకుండా చూసుకోవచ్చని తెలిపారు.
'ఈ ఔషధానికి సంబంధించి ఇది సమగ్ర సమీక్ష. నిర్ధిష్ట ప్రమాణాలతో డేటాను విశ్లేషించాం.'అని ఎఫ్ఎల్సీసీసీ అధ్యక్షుడు పీయర్ కోరీ చెప్పారు. కొవిడ్‌ను నిర్వహించడంలో ఇవర్‌మెక్టిన్ పాత్రను తేల్చడానికి 2500 మంది పరీక్షార్థులపై నిర్వహించిన 8 పరిశోధనలపై వీరు దృష్టిసారించారు. క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని తీసుకుంటే.. కరోనా సోకే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని తేల్చారు. కొవిడ్ బాధితులపైనా ఇది అద్భుతంగా పని చేస్తుందని 42 ప్రయోగాల డేటాను విశ్లేషించినప్పుడు వెల్లడైందన్నారు. ఈ ఔషధం.. బాధితుల్లో మరణం ముప్పును తగ్గిస్తోందని, శరీరం నుంచి వైరస్‌ను వేగంగా నిర్మూలిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి:'గత 40 ఏళ్లలో లేని విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి'