సరిహద్దు విషయంలో భారత్-చైనా మధ్య పెద్ద సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలకు సాయం చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఓక్లహోమాలోని తుల్సాలో నిర్వహించే ఎన్నికల ర్యాలీకి వెళుతున్న క్రమంలో భారత్-చైనా పరిస్థితిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు ట్రంప్.
" ఇది చాలా క్లిష్ట పరిస్థితి. మేము భారత్తో మాట్లాడుతున్నాం. చైనాతో మాట్లాడుతున్నాం. సరిహద్దులో వారికి పెద్ద సమస్య తలెత్తింది. వారు ఆపదకు అంచున ఉన్నారు. ఏమి జరుగుతుందో చూద్దాం. వారికి సాయం చేసేందుకే ప్రయత్నిస్తున్నాం."