అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై.. రానున్న రోజుల్లో అప్రమత్తంగా ఉండాలని మిత్రదేశాలను హెచ్చరించింది ఇరాన్. శ్వేతసౌధంలో అధ్యక్షుడిగా తన చివరి రోజుల్లో ఉన్న ట్రంప్.. ఎలాంటి దాడులకు పాల్పడే విధంగా చర్యలు చేపట్టవద్దని పశ్చిమాసియా దేశాలకు సూచించింది. ఇరాన్‌పై దాడి చేయాలని ట్రంప్ ఆలోచించినట్టువార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇరాన్ ఈ సూచన చేయడం గమనార్హం.
'ట్రంప్‌తో జాగ్రత్త' అన్న సమాచారాన్ని ఇరాన్ సైన్యంలోని ఓ సీనియర్ అధికారి.. మిత్రదేశాలకు స్వయంగా అందించడం ఇరదేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులకు అద్దంపడుతోంది. ట్రంప్ ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారనే దానిపై స్పష్టత లేకపోవడమూ ఇరాన్ హెచ్చరికలకు ఓ కారణం.