మనుషుల ప్రవర్తనలు ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. కొన్ని చేష్టలు ఒక్కోసారి నవ్వులు పూయిస్తే.. ఇంకొన్నిసార్లు కోపం తెప్పిస్తాయి. 'ఎంటి ఇలా చేశారు?' అని అనుకుంటాం. అమెరికాకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జైన్ రివెరా విషయంలోనూ ఇదే జరిగింది.
మియామీలో నివాసముండే 20ఏళ్ల రివెరాకు చాలా మంది ఫాలోవర్లే ఉన్నారు. కాగా.. ఇటీవల ఆమె ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. రివెరా తండ్రి మరణించగా.. ఇటీవలే అంత్యక్రియలు జరిగాయి. అక్కడికి వెళ్లిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది రివెరా. అక్కడికి ఆమె వేసుకెళ్లిన దుస్తులు.. ఓ పార్టీకి వెళితే ఎలా ముస్తాబు అవుతామో.. అచ్చం అలాగే ఉన్నాయి. అంతేకాకుండా.. తండ్రి శవపేటిక వద్ద వివిధ పోజుల్లో స్టిల్స్ దిగి వాటిని అప్లోడ్ చేసింది.
ఈ ఫొటోలు చూసి రివెరా ఫాలోవర్లకు కోపం వచ్చింది. 'ఏంటిది?' అని ప్రశ్నిచారు. 'తండ్రి అంత్యక్రియలను ఫొటోషూట్గా మార్చేశావా?' అంటూ మండిపడ్డారు. ఫొటోలు వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు.