తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆల్ఫా, డెల్టా రకాలపైనా కొవాగ్జిన్ సమర్థవంతం'

కొవాగ్జిన్ టీకా.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తోందని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్​ఐహెచ్) వెల్లడించింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్​ తీసుకున్న వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరిశోధన జరిపినట్లు తెలిపింది.

Covaxin
కొవాగ్జిన్

By

Published : Jun 30, 2021, 8:01 AM IST

ఆల్ఫా, డెల్టా కొవిడ్ వేరియంట్లపై భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా సమర్థంగా పనిచేస్తోందని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్​ఐహెచ్) వెల్లడించింది . కొవాగ్జిన్ టీకా ఆల్ఫా, డెల్టా వేరియంట్లను సమర్థవంతంగా నిర్మూలించినట్లు తమ పరిశోధనలో తేలినట్లు పేర్కొంది.

కొవాగ్జిన్ టీకా తీసుకున్న వ్యక్తుల బ్లడ్ సీరమ్‌పై జరిపిన అధ్యయనాల్లో బీ.1.1.7 ఆల్ఫా, బీ.1.617 డెల్టా వేరియంట్లను కొవాగ్జిన్ మట్టుబెట్టినట్లు ఎన్​ఐహెచ్ తెలిపింది.

ఎవరిపై ఎలా?

కొవాగ్జిన్ టీకా.. కొవిడ్​-19పై 100 శాతం పనిచేస్తోందని ఎన్​ఐహెచ్ డైరెక్టర్​ ఆంటోనీ ఎస్ ఫౌచీ తెలిపారు. కొవిడ్ లక్షణాలున్న వారిపై 78శాతం, కరోనాతో పాటు ఇతర వ్యాధులు ఉన్నవారిపై 70 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని తమ పరిశోధనలో తేలిందని ఫౌచీ వివరించారు.

ఇదీ చదవండి :11 నెలల తర్వాతే వ్యాక్సిన్​​ రెండో డోసు!

ABOUT THE AUTHOR

...view details