అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లోని మసీదుపై ఉగ్ర దాడిని(Afghanistan Masjid Attack) భారత్ అధ్యక్షతన జరిగిన ఐరాస భద్రతా మండలి(UNSC Meeting on Afghanistan) సమావేశం ఖండించింది. దీనిని హేయమైన దాడిగా, పిరికి చర్యగా అభివర్ణించింది. అలాగే అఫ్గాన్, పాక్‌లలో మైనారిటీలపై(Minorities in Afghanistan) వరుస దాడులు జరుగుతున్నాయని.. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ నెల మొదట్లో కాబుల్‌లోని 'కార్తె పర్వాన్' గురుద్వారా ధ్వంసాన్ని(Kabul Gurudwara Bomb Blast) ఈ సమావేశం తప్పుపట్టింది. ఉగ్రవాదం(Terrorist Groups in Afghanistan) ఏ రూపంలో ఉన్నా అంతర్జాతీయ శాంతి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుందని పునరుద్ఘాటించింది.
'కాబుల్ గురుద్వారా విధ్వంసం ఘటన భారత్‌కు మాత్రమే కాకుండా ప్రపంచానికి ఆందోళన కలిగించే అంశమని.. ఐరాస భద్రతామండలి తీర్మానంలో పేర్కొన్న లక్ష్యాలను నెరవేర్చేందుకు అంతర్జాతీయ సమాజం కట్టుబడి ఉండాలని' భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మరోవైపు.. అఫ్గాన్ మసీదుపై దాడిని ఐరాస సెక్రటరీ జనరల్(UNO Secretary General) ఆంటోనియో గుటెరస్(Antonio Guterres) ఖండించారు. బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు.