తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా జైల్లో తెలుగు విద్యార్థుల దైన్యం

అమెరికాలో నకిలీ యూనివర్సిటీలో ప్రవేశం పేరిట మోసపోయి, అరెస్టయిన తెలుగు విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. జైల్లో వారికి కనీసం సరైన తిండైనా లేక నరకం అనుభవిస్తున్నారు.

భారత విద్యార్థుల అరెస్టులపై న్యాయవాదుల ఆందోళన

By

Published : Mar 9, 2019, 4:57 PM IST

అమెరికాలోని డెట్రాయిట్​లో నకిలీ విద్యాసంస్థను నెలకొల్పి ఇమ్మిగ్రేషన్​ కుంభకోణం గుట్టును జనవరిలో బయటపెట్టారు అమెరికా అధికారులు. బోగస్​ విద్యాసంస్థల్లో విదేశీ విద్యార్థులకు వీసాలు ఇప్పించి సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని వెలుగులోకి తెచ్చారు.

ఈ విద్యాసంస్థలో ప్రవేశం కోసం 600 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులవే ఉన్నాయి. సివిల్ ఇమ్మిగ్రేషన్​ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 160 మంది విదేశీ విద్యార్థులను అరెస్టు చేశారు. 34 కేంద్రాల్లో వీరికి నిర్బంధించారు.

అరెస్టయిన భారత విద్యార్ధుల వివరాలు తెలుసుకునేందుకు అమెరికన్​ తెలుగు అసోసియేషన్​ ప్రయత్నాలు చేస్తోంది. విద్యార్థులు జైల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై అసోసియేషన్​ అధ్యక్షుడు పరమేశ్ భీమ్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందరినీ గుర్తించలేకపోతున్నామని తెలిపారు.

'అరెస్టయిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు పేదకుటుంబాల నుంచి వచ్చిన వారే. వారు ఏ నేరం చేయలేదు. వారిని ఎవరో తప్పుదోవ పట్టించారు. జైల్లో సరైన తిండి లేక చాలా మంది విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది' అని భీమ్​రెడ్డి అన్నారు.

అరెస్టయిన విద్యార్థులందరినీ ప్రస్తుతానికి దేశం విడిచి వెళ్లేలా చేస్తున్నామని అమెరికా అధికారులు తెలిపారు. వారికి మళ్లీ అవకాశం కల్పిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details