తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్వేతసౌధం సాక్షిగా సుధకు అమెరికా పౌరసత్వం

అమెరికా పౌరులుగా ఓ భారతీయురాలు సహా అయిదుగురు వలసదారులు ప్రమాణం చేశారు. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హాజరైన ఈ కార్యక్రమానికి శ్వేత సౌధం వేదికైంది.

Indian software engineer becomes US citizen
శ్వేతసౌధం సాక్షిగా సుధకు అమెరికా పౌరసత్వం

By

Published : Aug 26, 2020, 12:41 PM IST

Updated : Aug 26, 2020, 1:53 PM IST

ఓ భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సహా అయిదుగురు వలసదారులకు అమెరికా పౌరసత్వం కల్పించే అరుదైన ఘట్టానికి శ్వేత సౌధం వేదికగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరయ్యారు.

శ్వేతసౌధం సాక్షిగా సుధకు అమెరికా పౌరసత్వం

గ్రీన్‌ కార్డు పొందిన వీరంతా ట్రంప్‌ సమక్షంలో అమెరికా పౌరులుగా ప్రమాణం చేశారు. భారత్‌ నుంచి 13 ఏళ్ల క్రితం వలస వెళ్లిన సుధా సుందరి నారాయణన్ సహా లెబనాన్‌, బొలీవియా, సూడాన్‌, ఘనాకు చెందిన వారు ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు.

ఆమెపై ప్రశంసల జల్లు

వీరందరికీ ట్రంప్‌ అమెరికాలోకి స్వాగతం పలికారు. సుధా సుందరి... ఎంతో ప్రతిభ కలిగిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అని కొనియాడారు. అందుకే ఆమె అద్భుతమైన విజయాన్ని సాధించారని అన్నారు.

ఇదీ చదవండి:భారత్​ వ్యూహం: దీవులతో చైనాకు దీటుగా..!

Last Updated : Aug 26, 2020, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details