అమెరికాలోని నార్త్పోర్ట్కు చెందిన 17 ఏళ్ల భారత సంతతి బాలిక.. వనీజా రూపానీ అరుదైన గౌరవం దక్కించుకుంది. అంగారక గ్రహంపై ఉపయోగించే తమ తొలి హెలికాఫ్టర్‌కు వనీజా సూచించిన 'ఇన్జెన్యునిటీ' పేరు పెట్టాలని నాసా నిర్ణయించింది. నాసా నిర్వహించిన 'నేమ్ ద రోవర్' పోటీలో ఈ అమ్మాయి సమర్పించిన వ్యాసం ఎంపికయినందున.. ఈమె పేరును అధికారికంగా ఖరారు చేసింది.
'ఇన్జెన్యునిటీ' హెలికాఫ్టర్
అంగారకుడిపైకి పంపించే తదుపరి రోవర్‌కు 'పెర్జెవరాన్స్' అనే పేరు పెట్టింది. మార్చిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజయం సాధించిన ఏడో తరగతి బాలుడు అలెగ్జాండర్ మాథర్స్ సూచన మేరకు.. ఆ పేరును ఖరారు చేసింది. హెలికాఫ్టర్‌కు 'ఇన్జెన్యునిటీ' పేరు పెట్టింది. ఇన్జెన్యునిటీ మరో ప్రపంచంలో ఎగరనున్న శక్తిమంతమైన హెలికాఫ్టర్‌గా నాసా ట్విట్టర్లో పేర్కొంది. రోవర్‌తో సహా.. ఈ హెలికాఫ్టర్‌ను జులైలో అంగారక గ్రహంపైకి పంపనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇవి మార్స్‌ను చేరతాయి.