అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్.. తొలి యుద్ధం కొవిడ్ పైనేనని స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటామని విజయోత్సవ ప్రసంగంలో తెలిపారు. ఇందుకోసం సోమవారం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు ఉపాధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ ఫిజీషియన్ డాక్టర్ వివేక్ మూర్తిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్ణాటకకు చెందిన వివేక్ మూర్తి (43)ని 2014లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా.. అమెరికా 19వ సర్జన్ జనరల్‌గా నియమించారు. బ్రిటన్‌లో జన్మించిన వివేక్ మూర్తి 37 ఏళ్ల వయస్సులోనే ఆ బాధ్యతలను చేపట్టారు. ట్రంప్ పాలనా సమయంలో వివేక్ మూర్తి ఆ స్థానం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.