తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒహాయో సెనేటర్​గా 29 ఏళ్ల నీరజ్ - అమెరికాలో భారతీయుల జైత్రయాత్ర

అమెరికాలోని ఓహాయో సెనేటర్​గా భారతీయ-అమెరికన్ నీరజ్ అంతాని ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రానికి సెనేటర్​గా సేవలందించబోయే తొలి భారతీయ అమెరికన్​ ఆయనే​ కావడం విశేషం.

indo_us citizen as ohio senator
'అమెరికాలోని ఒహాయో సెనేటర్​గా భారతీయ-అమెరికన్'

By

Published : Jan 5, 2021, 1:05 PM IST

అమెరికాలోని ఓహాయో సెనేటర్​గా భారతీయ-అమెరికన్ నీరజ్ అంతాని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాష్ట్రానికి భారతీయ మూలాలున్న వ్యక్తి సెనేటర్​గా ఎన్నికవ్వడం ఇదే తొలిసారి.

ఒహాయోలోని 6వ జిల్లా నుంచి ఎన్నికైన 29ఏళ్ల అంతాని.. నాలుగేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.

నేను పుట్టి పెరిగిన రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ప్రజలకు సేవ చేసి.. కరోనా సంక్షోభ సమయంలో ఓహాయో ప్రజల అమెరికా కలల్ని నిజం చేయడానికి నా వంతు కృషి చేస్తా.

-నీరజ్​ అంతాని

నీరజ్ అంతాని ఇప్పటివరకు ఓహాయో ప్రతినిధుల సభలో సభ్యుడిగా సేవలందించారు. 42వ సభకు ఎన్నికైన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.

ఇదీ చదవండి:అమెరికా ఆర్థిక మండలి సభ్యుడిగా భారతీయ అమెరికన్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details