తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా సర్య్కూట్​ కోర్టు జడ్జిగా నియోమీ రావు బాధ్యతలు

భారతీయ-అమెరికన్​ న్యాయవాది నియోమీ జహంగీర్​ రావు అమెరికా సర్య్కూట్​ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి క్లెరెన్స్​ ధామస్​ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. సర్య్కూట్​​ కోర్టులో న్యాయమూర్తిగా నియామకమైన రెండో వ్యక్తిగా జహంగీర్ గుర్తింపు పొందారు.

నియోమీ జహంగీర్​ రావు

By

Published : Mar 21, 2019, 5:12 PM IST

భారత సంతతి న్యాయవాది నియోమీ జహంగీర్​ రావుఅమెరికాలోని కొలంబియా జిల్లాసర్య్కూట్​ కోర్టున్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు​. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ క్లెరెన్స్​ థామస్​ శ్వేతసౌధంలోని రూస్​వెల్ట్​ గదిలో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హాజరయ్యారు.ఆ దేశ సుప్రీం కోర్టు తరువాత అత్యంత శక్తిమంతమైన న్యాయస్థానం ఇదే.

కొలంబియా సర్య్కూట్​ కోర్టులో విధులు నిర్వర్తించి సుప్రీం న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్​ బ్రెట్​ కవనాగ్​ స్థానాన్ని భర్తీ చేయనున్నారు రావు.

భారత్​ నుంచి అమెరికా వెళ్లిన పార్సీ వైద్యులు జెరిన్​ రావు, జహంగీర్​ నరియోశాంగ్​ రావుల కుమార్తె నియోమీ జహంగీర్​. భారతీయ-అమెరికన్​ శ్రీనివాసన్​ తరువాత అమెరికాలోని అత్యంత శక్తిమంతమైన కోర్టులో ఉన్నత పదవిని అలంకరించిన రెండో వ్యక్తిగా గుర్తింపు పొందారు నియోమీ.

ABOUT THE AUTHOR

...view details