తెలంగాణ

telangana

ETV Bharat / international

'కశ్మీర్​లో 40% మేర ఉగ్ర ఘటనలు తగ్గాయ్​' - స్వయం ప్రతిపత్తి

ఆర్టికల్​ 370 రద్దు ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు అగ్రరాజ్యంలోని భారతీయ అమెరికన్లు. భారత ప్రభుత్వ నిర్ణయంతో గత రెండేళ్లలో జమ్ముకశ్మీర్​లో 40 శాతం మేర ఉగ్రవాద ఘటనలు తగ్గాయని పేర్కొన్నారు.

abrogation of Article 370
ఆర్టికల్​ 370 రద్దు ద్వితీయ వార్షికోత్సవం

By

Published : Aug 4, 2021, 12:30 PM IST

జమ్ముకశ్మీర్​కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని రద్దు చేసి ఆగస్టు 5వ తేదీకి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా అగ్రరాజ్యంలోని భారతీయ అమెరికన్లు ఆర్టికల్​ 370 రద్దు ద్వితీయ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. గడిచిన రెండేళ్లలో జమ్ముకశ్మీర్​లో 40 శాతం మేర ఉగ్రదాడులు తగ్గాయని పేర్కొన్నారు.

'కశ్మీర్​.. ప్రమాదకరమైన జోన్​ నుంచి ముందుకు సాగుతోంది' అనే ఇతివృత్తంతో అమెరికాలోని ప్రపంచ హిందూ మండలి(వీహెచ్​పీఏ) భాగస్వామ్య సంస్థ హిందూ పాలసీ రీసర్చ్​ అండ్​ అడ్వకసీ కలెక్టివ్​(హిందూ పీఏసీటీ) సహా గ్లోబల్​ కశ్మీరీ పండిట్​ డయస్పొరా(జీకేపీడీ), కశ్మీరీ, అఫ్గాన్​ డయస్పొరా కమ్యూనిటీలు వార్షికోత్సవాన్ని నిర్వహించాయి. ఇటీవల భారత పర్యటనకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​ వచ్చిన సమయంలోనే జులై 29న రెండు వారాల కశ్మీర్​ ఫార్వర్డ్​ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

"గత రెండేళ్లలో జమ్ముకశ్మీర్​లో ఉగ్ర దాడుల కేసులు 40 శాతం మేర తగ్గాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాదంపై గళమెత్తిన కాంగ్రెస్​ సిబ్బంది, ఎన్​జీఓ నాయకులు, మీడియా వ్యక్తులు హాజరయ్యారు. కశ్మీర్​లో పాకిస్థాన్​ మిలిటరీ, నిఘా విభాగాల మద్దతుతో ఇస్లామిస్ట్​ ఉగ్రవాదుల ఉనికి పెరుగుతోంది."

- భారతీయ అమెరికన్లు

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద ఘటనలు తగ్గినట్లు గత వారం పార్లమెంట్​కు తెలిపింది భారత ప్రభుత్వం. ' 2020లో ఉగ్రవాద కార్యకలాపాలు 2019తో పోలిస్తే 59 శాతం మెర తగ్గాయి. 2021, జూన్​ వరకు 32 శాతం మేర తగ్గాయి.' అని రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్​ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

ఆర్టికల్​ 370 2019, ఆగస్టు 5న రద్దు చేసింది భారత ప్రభుత్వం. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్​వ్యవస్థీకరించింది.

ఇదీ చూడండి:ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్రవాదానికి కళ్లెం

ABOUT THE AUTHOR

...view details