తెలంగాణ

telangana

ETV Bharat / international

వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత్​- అమెరికా చర్చలు

అమెరికా, భారత్​ మధ్య కీలక అంశాలపై రెండు దేశాల విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు చర్చలు జరిపారు. ఈ 2+2 చర్చల్లో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్షించారు.

వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత్​-అమెరికా చర్చలు

By

Published : Aug 23, 2019, 7:40 PM IST

Updated : Sep 28, 2019, 12:44 AM IST

భద్రత, రక్షణ, కీలక విదేశాంగ విధాన సమస్యలపై భారత్​, అమెరికా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాయి. కాలిఫోర్నియా మాంటెరేలో జరిగిన 2+2 చర్చల్లో భాగంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారంపై సమీక్షించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

"సమావేశంలో రెండు ప్రాంతాల అభివృద్ధిపై చర్చ సాగింది. హిందూ-పసిఫిక్​ ప్రాంతంలో పరిణామాలపై ప్రస్తావనలో స్వేచ్ఛ, శాంతి, పారదర్శకత ఏర్పడేలా కృషి చేయాలని నిర్ణయించాం. రక్షణ, భద్రత, విదేశాంగ విధానంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పురోగతిపై సమీక్షించాం."

-భారత విదేశాంగ శాఖ.

ఈ విధమైన 2+2 మంత్రిత్వ శాఖల చర్చలకు 2017లో ప్రధాని నరేంద్రమోదీ వాషింగ్టన్​ పర్యటనలో రెండు దేశాలు అంగీకరించాయి. గతేడాది సెప్టెంబర్​లో ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ భేటీల్లో అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి, రక్షణ మంత్రులు, భారత్​ నుంచి విదేశాంగ, రక్షణ మంత్రులు పాల్గొంటారు.

రెండోదశ సమావేశం వచ్చే రెండు నెలల్లో వాషింగ్టన్​లో జరగనుంది.

ఇదీ చూడండి: 'నవ భారత నిర్మాణం కోసం అహర్నిశలు కృషి'

Last Updated : Sep 28, 2019, 12:44 AM IST

ABOUT THE AUTHOR

...view details