తెలంగాణ

telangana

ETV Bharat / international

'ద్వైపాక్షిక చర్చలతో కశ్మీర్​కు​ పరిష్కారం రాదు' - వాజ్​పేయీ

కశ్మీర్​ సమస్య పరిష్కారానికి భారత మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ అతి సమీపంలోకి వచ్చారని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ద్వైపాక్షిక చర్చలతో శాంతి సాధ్యం కాదని, ఆ పనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మాత్రమే చేయగలరని అభిప్రాయపడ్డారు.

ట్రంప్​తో ఇమ్రాన్​

By

Published : Jul 24, 2019, 7:03 AM IST

కశ్మీర్​ సమస్యపై ఇమ్రాన్​ వ్యాఖ్యలు

ద్వైపాక్షిక చర్చల ద్వారా కశ్మీర్‌ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ స్పష్టం చేశారు. ఈ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ మధ్యవర్తిత్వం పోషించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్​.. కశ్మీర్​ సమస్యపై స్పందించారు.

"గతంలో భారత మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ, పాక్​ మాజీ అధ్యక్షుడు పర్వేజ్​ ముషారఫ్ కశ్మీర్​ సమస్య పరిష్కారానికి అతి సమీపానికి వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 130 కోట్ల మంది ప్రజల కోసం శాంతికి విఘాతం కలిగించే అంశాలను పరిష్కరించాలి. భారత్​ అణ్వాయుధాలను వదులుకుంటే తామూ అందుకు సిద్ధం. పుల్వామా ఉగ్రదాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్​ మధ్యవర్తిత్వంతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది."

-ఇమ్రాన్​ ఖాన్​, పాక్​ ప్రధాని

కశ్మీర్ అంశం మీద భారత్, పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరినట్లు ట్రంప్‌ ఇప్పటికే వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను భారత్​ ఖండించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి: 'ట్రంప్​ వ్యాఖ్యలపై మోదీ వివరణ ఇవ్వాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details