తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​ చేతికి ఐరాస భద్రతా మండలి పగ్గాలు - unsc president india news

ఆగస్టు నెలకుగాను ఐరాస భద్రతా మండలికి భారత్​ అధ్యక్షత వహించనుంది. ఫ్రాన్స్​ నుంచి ఈ బాధ్యతలను ఆదివారమే భారత్​ స్వీకరించింది. భారత్​ తన అధ్యక్ష హయాంలో.. శాంతి పరిరక్షణ దిశగా వివిధ దేశాలతో పలు కీలక సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.

india in unsc
ఐక్యారాజ్య సమితి భద్రతా మండలిలో భారత్​

By

Published : Aug 1, 2021, 1:43 PM IST

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ)లో ఆగస్టు నెలకుగాను అధ్యక్ష బాధ్యతలను ఫ్రాన్స్​ నుంచి భారత్​ ఆదివారం స్వీకరించింది. భద్రతా మండలిలో 2021-22 కాలపరిమితిలో తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న భారత్​.. యూఎన్​ఎస్​సీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఈ అధ్యక్ష పదవీ కాలంలో భారత్.. సముద్ర తీర భద్రత, శాంతి పరిరక్షణ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కీలక సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్​లో యూఎన్​ఎస్​సీకి భారత్​ మళ్లీ అధ్యక్షత వహించనుంది.

"ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అధ్యక్ష బాధ్యతలను భారత్​ చేపట్టింది. చారిత్రక, సన్నిహత సంబంధాలను భారత్​, ఫ్రాన్స్​ కలిగి ఉన్నాయి. భద్రతా మండలిలో భారత్​కు సహకారం అందించినందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు. యూఎన్​ఎస్​సీ అధ్యక్ష పదవీకాలంలో.. సముద్ర తీర భద్రతకు, శాంతిపరిరక్షణకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మూడు ఉన్నత స్థాయి సమావేశాలను భారత్​ నిర్వహించనుంది."

-టీఎస్​ తిరుమూర్తి, ఐక్యరాజ్యసమతిలో భారత శాశ్వత రాయబారి

సిరియా, ఇరాక్​, సోమాలియా, యెమెన్​, మధ్య ఆసియా దేశాలతో.. పలు కీలక సమావేశాలను యూఎన్​ఎస్​సీ నిర్వహించాల్సి ఉంది. సోమాలియా, మాలి, లిబెనాన్​లో పలు కీలక సంస్కరణల దిశగానూ చర్చలు చేపట్టాల్సి ఉంది.

"ఆగస్టు నెలకుగాను యూఎన్​ఎస్​సీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో.. సభ్య దేశాలతో కలిసి ఉత్పాదకంగా పనిచేసేందుకు భారత్​ ప్రయత్నిస్తుంది. భారత్​ ఎల్లప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తుంది."

-జై శంకర్​, విదేశాంగ మంత్రి.

ఈ ఏడాది జనవరి నుంచి ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్​ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఎన్నో అంశాలను శాంతియుతంగా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. యూఎన్​ఎస్​సీకి భారత్​ అధ్యక్షత వహించడాన్ని ఫ్రాన్స్​, రష్యా సహా పలు సభ్య దేశాలు స్వాగతించాయి.

తొలి ప్రధాని ఆయనే...

యూఎన్​ఎస్​సీ భారత్ అధ్యక్ష కాలంలో ఓ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారని క్యరాజ్య సమితికి భారత మాజీ రాయబారి సయ్యద్​ అక్బరుద్దీన్​ తెలిపారు. ఇలా యూఎన్​ఎసీలో సమావేశం నిర్వహించనున్న తొలి భారత ప్రధాని.. మోదీనేనని చెప్పారు. నాయకత్వం అంటే ముందుండి నడిపించాలనే దానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details