తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​లో 4.5 కోట్ల మంది మహిళలు మిస్సింగ్​! - UN report on missing females

ప్రపంచవ్యాప్తంగా గడిచిన యాభై ఎళ్లలో 14.26 కోట్ల మంది మహిళలు కనిపించకుండా పోతే.. అందులో మూడో వంతు భారత్​లోనే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 50 ఏళ్లలో సుమారు 4.58 కోట్ల మంది కనిపించకుండా పోయారని లెక్కగట్టింది.

India accounts for 45.8 million of the world's 'missing females': UN report
భారత్​లో 4.5 కోట్ల మంది మహిళలు మిస్సింగ్​!

By

Published : Jun 30, 2020, 5:05 PM IST

గడిచిన యాభై ఏళ్ల కాలంలో భారత్‌లో 4.58 కోట్ల మంది మహిళలు కనిపించకుండా పోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 50 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 14.26 కోట్ల మంది మహిళలు కనిపించకుండా పోతే.. అందులో మూడో వంతు భారత్‌లోనే నమోదుకావడంపై ఆందోళన వ్యక్తంచేసింది.

యునైటెడ్ నేషన్స్‌ పాపులేషన్ ఫండ్-యూఎన్​ఎఫ్​పీఏ విడుదల చేసిన 'ద స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2020' నివేదికలో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. 1970 నాటికి 6.10 కోట్ల మంది మహిళలు కనిపించకుండా పోతే.. అది 2020 నాటికి రెట్టింపైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ 50 ఏళ్ల కాలంలో భారత్‌లో 4.58 కోట్ల మంది మహిళలు కనిపించకుండా పోతే.. చైనాలో ఏకంగా 7.23 కోట్ల మంది కనిపించకుండా పోయారని ఐరాస నివేదిక వెల్లడించింది.

" లింగ వివక్ష, బాలికల్లో ప్రసవం అనంతరం మరణాలు ఎక్కువగా ఉండటం వీటికి ప్రధాన కారణం. 2013-17 మధ్య కాలంలో భారత్​లో సుమారు 4.60లక్షల మంది బాలికలు పుట్టినప్పుడే కనిపించకుండా పోయారు. మూడింట రెండొంతులు లింగ వివక్ష కారణంగా కాగా, ప్రసవానంతర మరణాలు ఒక వంతు ఉన్నాయి. వార్షికంగా ప్రపంచవ్యాప్తంగా లింగ వివక్ష కారణంగా పుట్టినప్పుడే తప్పిపోతున్న వారిలో చైనా, భారత్​లోనే 95 శాతం మేర ఉంటున్నాయి. మహిళల మరణాల రేటు భారత్​లోనే అధికంగా ఉంది. ఏటా వెయ్యి మంది అమ్మాయిలు పుడితే అందులో 13.5 మంది మరణిస్తున్నారు. ప్రతి తొమ్మిది మంది మృతుల్లో ఒకరు ఐదేళ్లలోపే ఉండటం ప్రసవానంతర లింగ ఎంపిక ప్రభావాన్ని చూపుతోంది. "

- నివేదిక

ఇదీ చూడండి: భార్య బొట్టు పెట్టుకోలేదని విడాకులిచ్చిన భర్త

ABOUT THE AUTHOR

...view details