అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగుతున్న మంటలు.. వారం రోజుల్లోనే 10లక్షల ఎకరాలను బూడిదగా మార్చేశాయి. వాతావరణం కాస్త అనుకూలించడం వల్ల కొన్ని చోట్ల మంటల విస్తరణను అగ్నిమాపక సిబ్బంది అడ్డుకోగలిగారు. కాలిఫోర్నియా కార్చిచ్చును అతిపెద్ద విపత్తుగా ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సహయం కోసం జాతీయ నిధులను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సాయంతో అగ్నికీలలతో నష్టపోయిన వారికి.. లబ్ది చేకూరుతుందని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్చిచ్చుతో వారంలోనే 10 లక్షల ఎకరాలు బూడిద - అమెరికా 10 లక్షల ఎకరాలు అటవీ భూమి దగ్గం
అమెరికా కాలిఫోర్నియా అడవుల్లో కొద్ది రోజుల నుంచి మంటలు చెలరేగుతున్నాయి. ఈ అగ్నికీలల కారణంగా 10 లక్షల ఎకరాల అటవీ భూమి బూడిదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదాన్ని అతి పెద్ద విపత్తుగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సహయం కోసం జాతీయ నిధులను అందించనున్నట్లు తెలిపారు.
పిడుగుల కారణంగా ఆగస్టు 15 నుంచి 585 చోట్ల అడవుల్లో మంటలులేచాయి. వాటిలో శాన్‌ఫ్రాన్సిస్కో అఘాతం ప్రాంతంలో రెండు సమూహాలుగా విస్తరిస్తున్న మంటలు.. కాలిఫోర్నియా చరిత్రలోనే అతిపెద్దవిగా అధికారులు..పేర్కొన్నారు. తేలిక పాటి గాలులు, రాత్రివేళలో మరింత తేమ, వాటి విస్తరణను కొంత అడ్డుకోవడంలో సాయపడినట్లు చెబుతున్నారు. దక్షిణ శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతంలో పొడి వాతావరణం.. అక్కడ చెలరేగిన మంటలకు మరింత ఆజ్యం పోస్తోంది. కాలిఫోర్నియా కార్చిచ్చులో.. ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 700 ఇళ్లు, ఇతర నిర్మాణాలు దగ్దమయ్యాయి. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది.