ఈశాన్య అమెరికా మంచు దుప్పటి కప్పుకుంది. శీతాకాలంలోనే అతిపెద్ద తుపానును మసాచుసెట్స్ ఎదుర్కొంది. సోమవారం ఉదయం వచ్చిన తుపానుతో న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో అడుగు మేర హిమం పేరుకుపోయింది.
ఈశాన్య అమెరికా గజగజ - మసాచుసెట్స్
ఈశాన్య అమెరికాలో మంచు తుపాను ప్రజలను వణికిస్తోంది. అడుగు ఎత్తు మేర హిమం పేరుకుపోయింది.
ఈశాన్య అమెరికా గజగజ
విద్యుత్ సరఫరా నిలిచిపోయి.... సోమవారం సాయంత్రం వరకు న్యూ ఇంగ్లాండ్లో 60 వేల మంది చీకట్లోనే ఉన్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్ల ముందు పేరుకుపోయిన మంచును అతికష్టం మీద తొలిగిస్తే తప్ప బయటకు రాలేని దుస్థితి ఏర్పడింది.
సాధారణంగా 7 నుంచి 8 అంగుళాల వరకు మంచు పేరుకుంటుంది. ఈసారి మాత్రం 15 అంగుళాల ఎత్తు వరకు మంచు ఉంది.