తెలంగాణ

telangana

ETV Bharat / international

నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను: ట్రంప్ - అమెరికా అధ్యక్షుడు

​కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి తమ మద్దతుదారులతో నేరుగా మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. తమకోసం ప్రార్థనలు చేసిన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు ట్రంప్​. ప్రత్యర్థులపై విమర్శలు చేశారు.

US President Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్

By

Published : Oct 11, 2020, 6:19 AM IST

కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన తర్వాత తొలిసారి బహిరంగ ప్రసంగం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఈ సందర్భంగా తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని తన మద్దతుదారులకు భరోసా కల్పించారు.

శ్వేతసౌధంలోని సౌత్​లాన్స్​లోని బాల్కనీ నుంచి ప్రసంగించారు ట్రంప్​. ఈ కార్యక్రమానికి వందల మంది రిపబ్లికన్​ మద్దతుదారులు బ్లూ టీ-షర్టులు, 'మరోమారు అమెరికాను గొప్పగా తయారు చేద్దాం' అని రాసి ఉన్న క్యాపులను ధరించి హాజరయ్యారు.

" నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా గురించి ప్రార్థించినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. మన దేశ చరిత్రలో ఇదే అతి ముఖ్యమైన ఎన్నిక. బయటకు వచ్చి ఓటు వేయండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ఫ్లోరిడా, నార్త్​ కరోనాలినా, నేవడా, జార్జీయా, టెక్సాస్​ వంటి అన్ని ప్రాంతాల్లో మనకు మంచి మద్దతు లభించింది. "

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

డెమొక్రటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​లపై విమర్శలు చేశారు ట్రంప్​. వారు వామపక్ష భావజాల రాజకీయ నేతలని ఎద్దేవా చేశారు. అశాస్త్రీయ లాక్​డౌన్​ల ద్వారా కరోనాను కట్టడి చేయగలమని వారు భావిస్తున్నారని విమర్శించారు. రిపబ్లికన్​ మద్దతుదారులు.. 'మరో నాలుగు సంవత్సరాలు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం' అనే నినాదాలతో హోరెత్తించిన క్రమంలో.. ఎన్నికల్లో వారిని చిత్తుగా ఓడించబోతున్నామని భావిస్తున్నట్లు చెప్పారు ట్రంప్​. కరోనా నుంచి కోలుకోవాలని తన కోసం, మెలానియా కోసం ప్రార్థనలు చేసిన మద్ధతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు ట్రంప్​. అమెరిక సైన్స్​, మెడిసిన్​తో చైనా వైరస్​ను సమూలంగా నిర్మూలిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

అధ్యక్షుడు ట్రంప్​ (74), ప్రథమ మహిళ మెలానియా ట్రంప్​(50)లకు గత వారం కరోనా సోకింది. చికిత్స నిమిత్తం సైనిక ఆసుపత్రిలో చేరారు ట్రంప్​. నాలుగు రోజుల తర్వాత శ్వేత సౌధానికి తిరిగివచ్చారు. అనంతరం తొలిసారి రిపబ్లికన్​ మద్దతుదారులతో నేరుగా మాట్లాడారు.

ఇదీ చూడండి: 'శ్వేతసౌధంలో కరోనా విజృంభణకు ఆ సమావేశమే కారణం'

ABOUT THE AUTHOR

...view details