అమెరికా న్యూయార్క్ నగరం విద్యుత్ స్తంభించిపోయి అంధకారమయమైంది. మాన్‌హట్టన్ ప్రాంతంలో విద్యుత్ కోత కారణంగా 42వేల మంది ఇబ్బందిపడ్డారు. సబ్వే స్టేషన్లు చీకటిలో మగ్గిపోయాయి. ఎలివేటర్లలో చిక్కుకున్న పలువురిని రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. కోతకు కారణాలను ప్రభుత్వం ప్రకటించలేదు.
న్యూయార్క్‌లో కరెంట్ కట్- నెటిజన్ల ఫైర్
అమెరికాలోని న్యూయార్క్ నగర వాసులు విద్యుత్ అంతరాయం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాన్‌హట్టన్ ప్రాంతంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోగా సబ్వే స్టేషన్లు చీకటిమయం అయ్యాయి.
న్యూయార్క్‌లో విద్యుత్ అంతరాయం
కరెంట్ కట్‌పై నగర పౌరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంధకారంగా ఉన్న సబ్వే స్టేషన్ల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
విద్యుత్ నియంత్రణ సంస్థ కాన్ ఎడిసన్ యుటిలిటి త్వరలో సరఫరాను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. అంతరాయ సమయాల్లో... ప్రయాణాలకు సబ్వే స్టేషన్లను ఎంచుకోవద్దని పౌరులకు సూచించింది.
Last Updated : Jul 14, 2019, 4:11 PM IST