తెలంగాణ

telangana

By

Published : May 12, 2020, 5:20 PM IST

ETV Bharat / international

వాసన గుర్తించే కణాల వల్లే కరోనా వ్యాప్తి!

కరోనా శరీరంలోకి ప్రవేశించడానికి సహాయపడుతున్న రెండు ప్రోటీన్లను ఎలుకల్లో గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నాసిక కుహరంలోని వాసన గుర్తించే కణాల ద్వారా వైరస్‌ ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. కరోనా బాధితులు వాసన కోల్పోవడానికి గల కారణం తెలిస్తే... కచ్చితమైన రోగనిర్ధరణకు సహాయపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

'How coronavirus infection disrupts people's sense of smell decoded'
వాసన గ్రాహకలే కరోనా వైరస్‌కు దోహదపడుతున్నాయా?

కరోనా శరీరంలోకి ప్రవేశించడానికి అవసరమైన రెండు ప్రోటీన్లు నాసికా కుహరంలో వాసనను గుర్తించే కణాల ద్వారా ఉత్పత్తి అవుతున్నాయని ఓ పరిశోధనలో తేలింది. దీనిని శాస్త్రవేత్తలు ఎలుకల్లో గుర్తించినట్లు తెలిపారు. కొంతమంది కొవిడ్‌-19 బాధితులకు పూర్తిగా లేదా పాక్షికంగా వాసన గుర్తించే శక్తిని ఎందుకు కోల్పోతున్నారో ఈ పరిశోధన ద్వారా కనుకొనవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పరిశోధనకు సంబంధించిన పలు అంశాలను 'ఏసీఎస్‌ కెమికల్‌ న్యూరోసైన్స్' జర్నల్‌లో ప్రచురించారు. చిన్న వాటి కంటే పెద్ద వయస్సు గల జంతువుల్లో అధికంగా ఈ ప్రోటీన్లు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు.

అది తెలిస్తే వ్యాధి నిర్ధరణ సులభం!

కరోనా బాధితులు వాసన కోల్పోవడానికి కారణం తెలిస్తే... కచ్చితమైన రోగనిర్ధరణకు సహాయపడుతుందని అమెరికాలోని రెనో స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ పరిశోధకులు చెప్పారు. ఇప్పటికి సార్స్-కోవ్‌-2లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని, అందులో వాసన కోల్పోవడానికి కారణం ఏమిటో అంతుపట్టడం లేదన్నారు. ఇతర కొవిడ్‌-19 లక్షణాలు లేనివారిలో కూడా ఇది కనిపిస్తున్నట్లు వివరించారు.

వాటిని హైజాక్‌ చేసి...

మానవ కణాలపై దాడి చేయడానికి ఏసీఈ2, టీఎంపీఆర్‌ఎస్‌ఎస్‌2 అనే రెండు ప్రోటీన్‌లను వైరస్‌ హైజాక్‌ చేస్తుందని అధ్యయనంలో గుర్తించారు. అయితే ఘ్రాణ ఎఫిథీలీయంలోని ఏ కణాలు ఈ ప్రోటీన్లను ప్రేరేపిస్తాయన్నది తెలియలేదని పేర్కొన్నారు.

అధ్యయనంలో భాగంగా ఎలుకలోని ఆ రెండు ప్రోటీన్లు, వయసును బట్టి వాటి పెరుగుదలలో మార్పులు గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.

ఈ ప్రోటీన్లు సుస్థిరమైన కణాలలో కనిపిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి ముక్కు కణాలు, గాలిలోని వాసనలను న్యూరాన్లకు బదిలీ చేయడానికి సహాయపడతాయి.

"ఘ్రాణశక్తి సంబంధించిన సుస్థిర కణాల్లో ప్రోటీన్‌ ఏసీఈ2, ప్రోటీస్‌ టీఎంపీఆర్‌ఎస్‌ఎస్‌2ను కనుగొన్నాం. అయితే ఎక్కువ ఘ్రాణ గ్రాహక న్యూరాన్లో చాలా తక్కువ పరిమాణంలో వీటిని గుర్తించాం."

-పరిశోధకులు

మానవుల్లో రుజువైతే...

ఎలుకల్లో చేసిన పరిశోధన ఫలితాల ఆధారంగా.. వైరస్‌ బాధితులు వాసన కొల్పోవడానికి, శరీరంలో ప్రవేశించడానికి సుస్థిర కణాలు తోడ్పడుతున్నాయని శాస్త్రవేత్తలు నివేదించారు. యుక్త ఎలుకలతో పోలిస్తే పెద్ద వయస్సు ఎలుకల్లోనే ఈ ప్రోటీన్‌లు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు.

ఇదే విషయం మానవుల్లో కూడా రుజువైతే.. వృద్ధులే ఎందుకు వైరస్‌కు ఎక్కువ సంఖ్యలో బలవుతున్నారో తెలుసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:జూన్​ వరకు లాక్​డౌన్​లోనే ఆ నగరం

ABOUT THE AUTHOR

...view details