కరోనా వైరస్‌ను నిలువరించటంలో సర్జికల్, ఎన్-95 మాస్కులు సమర్థంగా పనిచేస్తున్నాయని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే, వీటితో పెద్దగా సమస్య లేకపోయినా.. ఇంట్లో తయారు చేసే మాస్కులు అంత ప్రభావవంతం కావని పరిశోధకులు గుర్తించారు.
ఈ మాస్కుల మామూలు క్లాత్‌తో తయారు చేయటం వల్ల ఆ దారాల్లోని పైబర్ పెద్ద మొత్తంలో గాలిలోకి విడుదల అవుతున్నాయని చెబుతున్నారు. ఈ ఫైబర్ నీటి బిందువులను కూడా మోసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ఈ మాస్కులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం అవసరమని సూచిస్తున్నారు.
కాలిఫోర్నియా డేవిస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన ఈ అధ్యయన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మాస్కుల నుంచి కణాల ప్రవాహాన్ని కొలిచేందుకు కొంతమంది వలంటీర్లపై ప్రయోగాలు చేశారు. శ్వాసించేటప్పుడు, మాట్లాడటం, దగ్గు, నమలడం ఇలా పలు సమయాల్లో బిందువుల ప్రవాహాన్ని గుర్తించారు.