అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టే తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి ఆసియా సంతతి వ్యక్తిగా రికార్డుకెక్కిన కమలా హారిస్.. పాలనా యంత్రాంగంలోనూ ముఖ్య పాత్ర పోషించనున్నారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను ఎదుర్కోవడంలో కీలకం కానున్నారు. సెనేట్‌లో ఇరుపార్టీలకు సమాన ఆధిక్యం ఉన్న నేపథ్యంలో సభాధ్యక్ష హోదాలోనూ కమలనే పాలనా వ్యవహారాలను చక్కబెట్టనున్నారు.
ఇదీ చదవండి:'నేను శ్యామల కూతుర్ని.. అలా పిలిపించుకుంటేనే నాకు ఆనందం'
ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన హారిస్‌కు ఏ పోర్ట్‌పోలియోలు కేటాయించే విషయంపై స్పష్టత లేనప్పటికీ.. బైడెన్ చేపట్టే ప్రతి అజెండాలో కమల హస్తం ఉంటుందని ఆమె అధికార ప్రతినిధి సైమోన్ శాండర్స్ పేర్కొన్నారు.
"కొన్ని అంశాల బాధ్యతను బైడెన్.. కమలకే ప్రత్యేకంగా ఇచ్చే అవకాశం ఉంది. వాటిని పక్కనబెడితే ప్రతి విషయంలో ఆమె పాత్ర ఉంటుంది. ప్రతి అంశంలో పాల్గొనే అవకాశం ఉంది. కీలకమైన సమాచారం అందించడం నుంచి అభిప్రాయాలు వెల్లడించే వరకు ఆమెది ప్రధాన పాత్ర. అన్ని విషయాల్లో బైడెన్‌కు సహాయంగా ఉంటారు."
-సైమోన్ శాండర్స్, కమలా హారిస్ ప్రతినిధి
అధికార బదిలీలో కమలా పనితనాన్ని గమనించినవారు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే ఏదో ఒక బాధ్యతను అప్పగించి కమలను ఇతర పాలన వ్యవహారాల నుంచి దూరం చేయడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. బైడెన్ యంత్రాంగం ఎదుర్కోబోయే సమస్యలను కలిసికట్టుగా పరిష్కరించాలని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం, కరోనాపై పోరు, వాతావరణం, జాతి వివక్షను రూపుమాపడం వంటి సమస్యలపై బైడెన్ యంత్రాంగం ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ఈ నాలుగు ప్రాధాన్యాల్లో కమల కీలకంగా వ్యవహరిస్తారని విశ్లేషకులు అంటున్నారు.
"ఈ విషయాలపై ఆమె ముద్ర ఉంటుంది. వీటిపై కమలకు కచ్చితమైన అభిప్రాయం ఉంది. ప్రస్తుతం దేశం క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటోంది. వీటిని పరిష్కరించేందుకు అన్ని చేతులు కలవాల్సి ఉంది."
-సైమోన్ శాండర్స్, కమలా హారిస్ ప్రతినిధి
అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బైడెన్ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కమలా హారిస్ పోషించిన పాత్ర ఎనలేనిది. వేర్వేరు అంశాలపై నిర్వహించిన కీలక సమావేశాలకు కమల హాజరయ్యారు. కరోనా ఉద్దీపన బిల్లు, భద్రత సమస్యలు సహా క్యాబినెట్‌కు ఎవరిని ఎంపిక చేయాలన్న విషయాలపై అనేక సూచనలు అందించారు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోయే బైడెన్‌తో ప్రతిరోజు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అధికార బదిలీ సహా ఇతర విషయాలపై చర్చించేందుకు ఆయన నివాసం ఉండే డెలావేర్కు తరచుగా వెళ్తున్నారు.
బైడెన్ ఓటు కమలకే
కీలక విషయాల్లో కమల నిర్ణయానికే బైడెన్ ప్రాధాన్యం ఇస్తారని అధికార బదిలీ ప్రక్రియకు సంబంధం ఉన్న అధికారులు చెబుతున్నారు. సమావేశాల్లో భాగంగా ఏదైనా అంశంపై చర్చించే సమయంలోనూ ముందుగా కమల అభిప్రాయాన్నే తెలుసుకుంటారని వెల్లడించారు.
బైడెన్-ఒబామా బంధంలా..