మరణశిక్షను రద్దు చేయాలని లేదా తాత్కాలికంగా నిషేధం విధించాలని ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. భారత్లో నలుగురు నిర్భయ దోషులను ఉరితీసిన ఒక్క రోజు తరువాత ఐరాస ఈ విధంగా స్పందించడం గమనార్హం.
"మేము మరణశిక్ష విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రపంచ దేశాలు మరణశిక్ష అమలు చేయడాన్ని ఆపేయాలి.. లేదా తాత్కాలికంగా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేస్తున్నాం." - ఐరాస
దిల్లీలో ఏడేళ్ల క్రితం నిర్భయ అనే యువ వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘోరానికి పాల్పడిన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్లను తిహార్ జైలులో నిన్న ఉదయం 5:30 గంటలకు ఉరితీశారు.
దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు అయిన తిహార్లో నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయడం ఇదే మొదటిసారి. ఈ కేసుతో భారత్లోని అత్యాచార చట్టాలను మరింత కఠినం చేసేందుకు అవకాశం ఏర్పడింది.
ఇదీ చూడండి:నిర్భయ భారతం - మృగాళ్లకు గుణపాఠం