కొందరు షాపింగ్‌కి వెళ్లో, రెస్టారెంట్‌కు వెళ్లో.. అక్కడి సిబ్బందిని వివిధ రకాల ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు. సిబ్బంది ఎంతో సహనంతో వారికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వాళ్లు మనుషులే కదా! ఒక్కోసారి వారూ సహనం కోల్పోతారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన ప్రవర్తనతో అక్కడి హెయిర్ డ్రెస్సర్‌కు చిరాకు తెప్పించి.. చివరికి భంగపాటుకు గురైంది.
నవ్వులే నవ్వులు..
ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి సెలూన్‌కు వెళ్లింది. జుట్టు శుభ్రం చేసుకునేందుకు కూర్చుంది. సెలూన్ సిబ్బంది ఒకరు నీళ్లతో ఆమె జుట్టు కడగడం మొదలు పెట్టారు. ఇంతలో తన స్నేహితురాలితో మాట్లాడటం మొదలు పెట్టింది ఆ మహిళ. పదేపదే లేచి కబుర్లు చెప్పింది. ఆ హెయిర్ డ్రెస్సర్ ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.