ప్రపంచంలోనే తొలిసారిగా గొరిల్లాలకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. అమెరికాలో శాన్ డీగో జూలోని గొరిల్లాలు లక్షణాలేవీ లేకుండానే కరోనా బారిన పడ్డాయని అధికారులు తెలిపారు.
ఇదే తొలిసారి..
తొలుత జూ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. వారంతా మాస్కులు పెట్టుకున్నప్పటికీ గొరిల్లాలు మహమ్మారి బారిన పడ్డాయని అధికారులు వివరించారు. గతంలో పులులకు కరోనా సోకిన ఘటనలున్నా.. గొరిల్లాలకు సోకడం మాత్రం ఇదే తొలిసారి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న గొరిల్లాలు కరోనా బారిన పడిన నేపథ్యంలో వన్యప్రాణి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
''కరోనా సోకిన గొరిల్లాలను జాగ్రత్తగా చూసుకుంటున్నాం.. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. దగ్గు, జలుబు వంటి లక్షణాలున్నప్పటికీ.. ప్రస్తుతం వీటి ఆరోగ్యం బాగానే ఉంది. వాటి నివాస ప్రాంతంలోనే ఉంచి వాటికి చికిత్స అందిస్తాం. విటమిన్లు, బలమైన ఆహారం అందిస్తున్నాం.''