తెలంగాణ

telangana

ETV Bharat / international

గూగుల్​ 'జాబిల్లి డూడుల్​​' అదుర్స్!

చంద్రునిపై మానవుడు తొలిసారి కాలుమోపి నేటికి సరిగ్గా 50ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రత్యేక డూడుల్​ రూపొందించింది ప్రఖ్యాత సెర్చ్​ ఇంజిన్​ గూగుల్​.

GOOGLE MOON DOODLE

By

Published : Jul 20, 2019, 5:27 PM IST

అపోలో 11 విషన్​ ద్వారా అమెరికా 50 ఏళ్ల క్రితం చరిత్ర సృష్టించింది. నాసా వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కాలిన్స్ చంద్రునిపైకి వెళ్లిన రాకెట్​లో ఉన్నారు. జాబిల్లిపై అడుగుపెట్టిన మెదటి వ్యక్తిగా నీల్​ ఆర్మ్​స్ట్రాంగ్​ చరిత్ర నెలకొల్పారు.

చంద్రుడిపై తొలి అడుగు అర్ధ శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఓ వీడియోతో ప్రత్యేక డూడుల్ రూపొందించింది గూగుల్. ఆ వీడియోలో అపోలో 11 మిషన్ ఎలా జరిగిందో తన గొంతుతో స్వయంగా వినిపించారు కాలిన్స్​. భూమిపై నుంచి చంద్రుని మీదకు రాకెట్​ ఎలా వెళ్లిందో కళ్లకు గట్టినట్టు యానిమేషన్​ దృశ్యాలు చూపిస్తూ సవివరంగా చెప్పారు.

"హాయ్ అయామ్​ మైక్​ కాలిన్స్​. 50 ఏళ్ల క్రితం నీల్​ ఆర్మ్​స్ట్రాంగ్​, బజ్ ఆల్డ్రిన్​లతో కలిసి అపోలో 11లో ఓ సాహస యాత్రకు బయలుదేరాను" అని మొదలైన వీడియో... వారు జాబిల్లిని ఎలా చేరుకున్నారు, ప్రయాణం మధ్యలో జరిగిన పరిణామాలు, ప్రయోగం విజయవంతమైన అనంతరం పారాషూట్​ సాయంతో సముద్రంపై ల్యాండ్​ అయిన తీరును యానిమేషన్​ రూపంలో వివరించారు కాలిన్స్​.

వీడియోలో కాలిన్స్​ చెప్పిన పలు కీలక విషయాలు

  • భూమిపై నుంచి 1969 జులై 16న అపోలో 11 నింగికెగిసింది.
  • ఈ ప్రయోగంలో ఇంజనీర్ల నుంచి, కంప్యూటర్ ప్రోగ్రామర్ల వరకు మొత్తం 4లక్షల మంది కృషి ఉంది.
  • నీల్ ఆర్మ్​స్ట్రాంగ్​, బజ్​ ఆల్డ్రిన్​ జులై 20న చంద్రునిపై కాలు మోపారు.
  • జాబిల్లికి కొన్ని మైళ్ల దూరంలో ఏకాంతంగా ఉన్నారు కాలిన్స్​.
  • జులై 24న భూమ్మీదకు చేరుకున్నారు. పిసిఫిక్​ సముద్రంలో పారాషూట్​ సాయంతో దిగారు

ABOUT THE AUTHOR

...view details